Friday, December 20, 2024

వెస్ట్రన్ కల్చర్ కంటే మన కల్చర్ గొప్పది

- Advertisement -
- Advertisement -

నోయల్, రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా ‘బహిర్భూ మి‘. ఈ చిత్రాన్ని మహంకాళి ప్రొడక్షన్ బ్యా నర్‌పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. బహిర్భూమి సినిమా త్వరలోనే గ్రాం డ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజా గా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మచ్చ వే ణు మాధవ్ మాట్లాడుతూ “-సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో మంచి డేట్ చూసి గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తాం”అని అన్నారు.

దర్శకుడు రాంప్రసాద్ కొండూరు మాట్లాడుతూ “-వెస్ట్ర న్ కల్చర్ కంటే మన కల్చర్ చాలా గొప్పది. ఈ విషయాన్ని మా మూవీలో అంతర్లీనంగా చెబుతున్నాం. హీరోయిన్ రిషిత చాలా బా గా నటించింది”అని తెలిపారు. హీరో నోయ ల్ మాట్లాడుతూ “నేను చిన్న మూవీస్ చే యొద్దు అనుకుంటున్న టైమ్‌లో వచ్చిన చి త్రం బహిర్భూమి. ఈ సినిమాకు ముగ్గురు మెయిన్ పిల్లర్స్. వాళ్లే నిర్మాత వేణు మాధవ్, దర్శకుడు రాంప్రసాద్, సినిమాటోగ్రాఫర్ ప్ర వీణ్. వీళ్లు ముగ్గురు లేకుంటే ఈ సినిమా లే దు. బహిర్భూమి టైటిల్ ఎందుకు పెట్టామనే ది సినిమాలో చూడండి. చాలా మంచి మూ వీ చేశాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి”అని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రిషిత నెల్లూరు, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయ క్, జబర్దస్త్ ఫణి, డిఓపి ప్రవీణ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News