- Advertisement -
హైదరాబాద్: మనం ప్రపంచదేశాలతో పోటీ పడుతున్నామంటే మాజీ ప్రధాన మంత్రులు పీవీ, మన్మోహన్ సింగ్ లు తీసుకొచ్చిన సంస్కరణలేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ ప్రధాని అయ్యాక పారిశ్రామిక విధానంలో మార్పులు తెచ్చారని కొనియాడారు. బుధవారం నగరంలో ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు.సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సృష్టించేందుకే ఈ పాలసీని తెచ్చినట్లు ఆయన చెప్పారు.
పాలసీ లేకుండా ఏ ప్రభుత్వమూ నడవదని.. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకే ఈ పాలసీని తీసుకొస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇన్సెంటివ్ హామీలను తాము నెరవేరుస్తామని సిఎం చెప్పారు.ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు కూడా పాల్గొన్నారు.
- Advertisement -