Friday, September 20, 2024

బెంగాల్ సిఎస్‌కు జూడాల లేఖ

- Advertisement -
- Advertisement -

ఆసుపత్రుల్లో భద్రత వంటి ‘కీలక అపరిష్కృత సమస్యలు’ కొన్నిటిని చర్చించాలని కోరుతూ నిరసనకారులైన జూనియర్ డాక్టర్లు బుధవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (సిఎస్) మనోజ్ పంత్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం వెలుపల తాము సాగస్తున్న బైఠాయింపు సమ్మెను విరమించేందుకు వారు ఆ ముందస్తు షరతు విధించారు. బుధవారం ఉదయం ముగిసిన తమ సర్వసభ్య సమావేశం నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు బుధవారం ఉదయం 11.19 గంటలకు ఇమెయిల్ పంపారు. ప్రభుత్వ ఆసుపత్రుల లోపల రక్షణ,

భద్రత సమస్యలు, ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు కానున్న టాస్క్ ఫోర్స్ రూపకల్పన, బాధ్యతల వివరాలను తమ ప్రతిపాదిత సమావేశానికి అజెండాగా నిరసనకారులు సూచించారు. ‘సిఎంతో తాము జరిపిన గత సమావేశం నేపథ్యంలో మా ఐదు అంశాల డిమాండ్ విషయమై, అపరిష్కృతంగా ఉన్న కీలక అంశాలు కొన్నిటిని మేము పునరుద్ఘాటించాలని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఆరోగ్య సేవ వ్యవస్థ అభివృద్ధి, రక్షణ, భద్రత, ప్రస్తుతం ఉన్న బెదరింపు సంస్కృతికి సంబంధించిన మా నాలుగవ, ఐదవ అంశాలపై చర్చించాలి’ అని వారు ఇమెయిల్‌లో సూచించారు. కాగా, చర్చల కోసం వారు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం నుంచి స్పందన రావలసి ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News