Saturday, December 21, 2024

ఇది ఆచరణసాధ్యం కాదు.. జమిలి ఎన్నికలపై ఖర్గే వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

ఒక దేశం ఒకే ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్ బుధవారం అభిప్రాయపడింది. ఎన్నికలు జరుగుతున్న ప్రతి సందర్భంలోను అసలు సమస్యలను పక్కదారి పట్టించడానికి బిజెపి ఇటువంటి అంశాలను తెరమీదకు తీసుకువస్తుందని కాంగ్రెస్ విమర్శించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనపై ఇచ్చిన వివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దీనిపై స్పందిస్తూ ఇది ఆచరణసాధ్యం కాదని, ఇది అమలు కాదని చెప్పారు. ఎన్నికలు వచ్చినపుడు తమ వద్ద ఎటువంటి అంశాలు లేని సమయంలో అసలు సమస్యలను పక్కదారి పట్టించడానికి బిజెపి ఈ పని చేస్తుంటుంది అని ఖర్గే వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News