Friday, January 3, 2025

వాసవి టవర్స్ పై హైడ్రా ఆరా..?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నోయిడా ట్విన్ టవర్స్ తరహాలోనే బాచుపల్లిలోని కోమటికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన వాసవి టవర్స్ ను కూల్చే దిశగా హైడ్రా ప్రణాళికలను సిద్ధం చే స్తున్నట్టు తెలిసింది. కోమటికుంటలోకి వచ్చిన వాసవి కన్‌స్ట్రక్షన్స్‌లోని 8, 9 బ్లాక్‌లపై పూర్తి స మాచారాన్ని సేకరిస్తున్నట్టు సమాచారం. అయి తే, వాటిపై చర్యలు తీసుకునే ముందు లీగల్ స మస్యలు తలెత్తకుండా అన్నిరకాల సమాచార సే కరణలో హైడ్రా ఉన్నట్టు సమాచారం. నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలో ఏడు ఎకరాల్లో విస్తరించిన ’కోమటికుంట’ చెరు వు (లేక్ ఐడి 2822) ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో కి వచ్చేట్టుగా ‘వాసవి కన్‌స్ట్రక్షన్ ’ 8, 9 బ్లాక్‌ల నిర్మాణాలను చేపట్టారనేది హైడ్రాకు ఫిర్యాదు అందినట్టు తెలిసింది. 2022వ సంవత్సరం నుం డి కోమటికుంట ఎఫ్‌టిఎల్‌లో మట్టినింపడం, షెడ్లు వేస్తూ చివరకు బహుళ అంతస్థుల భవనాల్లోని 8,9 బ్లాక్‌ల నిర్మాణాలు చేపట్టినట్టు స్థానికులు పలువురు లిఖిత పూర్వకంగా హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన హైడ్రా.. వాసవి నిర్మాణాల్లోని 8, 9 బ్లాక్‌లు, వాటి నిర్మా ణ అనుమతులు, ఎన్‌ఓసిలు, క్లారిఫికేషన్స్, కో మటికుంట విస్తీర్ణం, ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ హ ద్దులు, ఏదేని న్యాయపరమైన లిటిగేషన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో హైడ్రా ఉన్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే నిజాంపేట్, జీహెచ్‌ఎంసి మునిసిపల్‌తో పాటు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సాంకేతికపరమైన, నిర్మాణ
అనుమతులపైనా సమగ్రంగా చర్చిస్తున్నట్టు తెలిసింది.

నిమిషాల్లోనే..
బహుళ అంతస్థుల భవనాలను కేవలం కొద్ది నిమిషాల్లోనే నేలమట్టం చేసేలా, సమీపంలోని భవనాలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా కూల్చివేతలు జరిగేలా కొత్త టెక్నాలజీని, యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని హైడ్రా నిర్ణయించినట్టు తెలిసింది. కోమటికుంట చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలోకి వచ్చే 8,9 బ్లాక్‌లను నోయిడాలోని ట్విన్ టవర్స్ తరహాలోనే చర్యలు తీసుకునే యోచన చేస్తున్నప్పటికీ లీగల్ సమస్యలను క్లీయర్ చేసుకునే దిశగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 2022లోనే ఇరిగేషన్ అధికారులు ఈ నిర్మాణ సంస్థ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదులు చేసినట్టు కూడా హైడ్రాకు సమాచారం చేరినట్టు తెలిసింది. గతంలో నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ కూడా 8వ బ్లాక్ నిర్మాణం చేయవద్దని నోటీసులు ఇచ్చినట్టు హైడ్రాకు నివేదిక అందినట్టు అధికార వర్గాల అభిప్రాయం. నిజాంపేట్ కమిషనర్ కూడా చర్యలు తీసుకునే దిశగా పోలీసుల సహాకారం గతంలో కోరినట్టు స్థానికులు హైడ్రాకు సమాచారమిచ్చారనేది తెలిసింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలతో వాసవికి చెందిన 8, 9 బ్లాక్‌లపై చర్యలు తీసుకునే దిశగా హైడ్రా యోచిస్తున్నట్టు సమాచారం.

ఇదీ కోమటికుంట
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం, గ్రామంలోని కోమటికుంట (ఐడి నెం.2822) చెరువులో నీరు విస్తరిత ప్రాంతం 2.100 ఎకరాలు. చెరువు ఎఫ్‌టిఎల్ వరకు విస్తరిత ప్రాంతం 7.650 ఎకరాలుగా ఉన్నట్టు హెచ్‌ఎండిఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ నమోదు చేసింది. గత ఏడాది నవంబర్ 2023లో ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహించి హద్దులు ఖరారు చేశారు. కోమటికుంట చెరువు ఎఫ్‌టిఎల్ నుంచి బఫర్ జోన్ 9 మీ.లు (30 అడుగులు)గా ఉన్నట్టు జీఓ నెం. 168 ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం కోమటికుంట చెరువు ఆనవాళ్ళు కూడా కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది. మొత్తం పూడ్చివేతలతో కుచించుకుపోయింది. చెరువు మధ్యలోకి కాంపౌండ్ వాల్స్ వచ్చాయి. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ల పరిధిలోకి వాసవి కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన 8, 9 బ్లాక్‌లు వస్తున్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో చర్యల దిశగా హైడ్రా యోచిస్తున్నట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News