Saturday, December 21, 2024

జమిలికి గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి మండలి బుధవారం జరిపిన కీలక సమావేశంలో చంద్రయాన్ 4కు ఆమోదం తెలిపింది. దేశ అంతరిక్ష రంగం మ రింత ముందుకు సాగేందుకు వీలుగా ఈ చంద్రయాన్ 4ను సంకల్పించారు. జమిలి ఎన్నికల ప్ర క్రియ నివేదికకు ఆమోదంతో పాటు తీసుకున్న నిర్ణయాలలో రైతుల సంక్షేమ చర్యల కేంద్రీకృ త అంశాలు కూడా ఉన్నాయి. ఇక దేశంలోని ఆ దివాసీలు, గిరిజనుల అభ్యన్నతికి తీసుకోవల్సిన చర్యలకూ ఆమోదం తెలిపారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన భేటీలో ఆమోదిత అంశాల ను తరువాత కేంద్ర సమాచార శాఖ మంత్రి అ శ్వని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. అంతరిక్ష ప్రాజెక్టులు దేశ నవయువతరానికి అత్యంత కీల కం. ఈ దిశలో పలు స్పేస్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపారు. వీనస్ ఆర్బిటర్ మిషన్ (వామ్)ను అంతరిక్ష నౌక రూపకల్పన సహా ప్ర యోగం 2028 మార్చి వరకూ సాగే కార్యక్రమాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రగ్రహానికి పరిశోధనల నిమిత్తం తలపెట్టిన ప్రాజెక్టుకు రూ.1236 కోట్లు కేటాయించారు. ఇందు లో అంతరిక్ష నౌక తయారీకి రూ రూ 824 కో ట్లకు పైగా వెచ్చిస్తారు.

కేబినెట్ భేటీలో అంతరి క్ష పరిశోధన కేంద్రం భారతీయ అంతరిక్ష స్టే షన్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా ఆమో దం దక్కింది. ఇప్పటి గగన్‌యాన్ ప్రాజెక్టు విస్తరణ కు ఈ స్టేషన్ మొదటి స్టేషన్ ఏర్పాటు దారితీస్తుందని మంత్రి వివరించారు. 2028 డిసెంబ ర్ నాటికి అంతరిక్ష కేంద్రం తొలి మాడ్యూల్ బా స్ 1 ఏర్పాటు పూర్తవుతుందని అంచనా వేశారు. ఇప్పటి సవరించిన కేటాయింపుల క్రమంలో గగన్‌యాన్ ప్రాజెక్టుకు కేటాయింపులు రూ 20,193 కోట్ల స్థాయికి చేరుతాయి. ఇక చంద్రయాన్ 3 విజవయవంతం తరువాత చంద్రయా న్ 4 చేపడుతారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టుకు కూడా కేబినెట్ సమ్మతి దక్కింది, దీని కో సం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ 2,104 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా 36 నెలల పాటు సాగే కార్యక్రమం అమలు చేస్తారు. ఫాస్పేట్ పోటాసియం ఎరువులకు సబ్సిడీలు కేంద్ర కేబినెట్ సమావేశంలో రబీ సీజన్‌లో రైతులకు ఫాస్పేట్, పోటాసియం ఎరువు సబ్సిడీలకు సంబంధించి రూ 25,475 కోట్లు కేటాయించా రు. ప్రధాన మంత్రి అన్నదాత అయ్ సంరక్షణ అభియాన్ (పిఎం ఆశా)కు కూడా ఆమోదం తెలిపారు. బయోటెక్నాలజీ సంబంధిత రెండు ఏకీకృత పథకాలకు కూడా కేంద్రం సమ్మతి ద క్కింది. ఇది బయో రైడ్ స్కీంగా ఉంటుంది. బ యోటెక్నాలజి పరిశోధన, ప్రగతి దిశలో పలు కార్యక్రమాలు ఉంటాయి. ఇక సంబంధిత రం గంలో పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు.

గిరిజనుల అభ్యున్నతికి రూ. 79,156 కోట్లు
ఇక దేశంలో ఆదివాసీలు, గిరిజనుల అభ్యున్నతికి సంబంధించి ప్రధాన మంత్రి జన్‌జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని రూ 79, 156 కోట్ల కేటాయింపులతో చేపడుతారు. దీనికి కూడా ఆమోదం తెలిపారు. ఇందులో కేంద్రం వాటా రూ 79,156 కోట్లు, రాష్ట్రాల వాటా రూ 22,823 కోట్లుగా ఉంటుంది. ఈ పథకం దేశంలోని 63,000ల గ్రామాలకు విస్తరించుకుంటుంది.ఈ క్రమంలో దాదాపు 5 కోట్ల మంది గిరిజనులకు మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు.
మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమకు చేయూత
దేశంలోని ఎంటర్‌టైన్‌మెంట్ అనుబంధ మీడియా విస్తరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ వంటి రంగాల సబంధిత మండలి లేదా బోర్డు ఎన్‌సిఒఇ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News