Sunday, November 10, 2024

ఉద్యోగుల హెల్త్‌స్కీంపై జెఎసి ముసాయిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రా ష్ట్రంలోని ఉద్యోగులు,పెన్షనర్లు,వారి పై ఆధారపడిన కుటుంబ సభ్యుల కోసం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను అ మలు చేయాలని తెలంగాణ ఉద్యోగు ల జేఏసి కో రింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నూతన ఈహెచ్‌ఎస్ విధానం అమలు కోసం ఒక ముసాయిదాను రూపొం దించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను
వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు తెలంగాణ ఉద్యోగుల జేఏసి చైర్మన్ వి.లచ్చిరెడ్డి, జేఏసి నాయకులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి ప్రస్తుతం అమలవుతున్న హెల్త్ స్కీంలో ఉన్న లోటుపాట్లు, కొత్తగా ప్రతిపాదించిన హెల్త్ స్కీంతో ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు, తద్వారా ప్రభుత్వానికి వచ్చే పేరు గురించి మంత్రికి వివరించారు. కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వానికి భారం లేకుండా, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందే వైద్య సేవల గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటు గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీఓతో ఉద్యోగులు పడుతున్న కష్టనష్టాల గురించి మంత్రికి వివరించారు. వెంటనే జీఓ నెంబర్ 317 ను రద్దుచేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు..

ప్రస్తుత విధానంతో సమస్యలు
ప్రస్తుత మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం వల్ల ఆపద సమయంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని జేఏసి చైర్మన్ లచ్చిరెడ్డి మంత్రి దామోదర రాజనర్సింహతో పేర్కొన్నారు. అత్యవసర సమయంలో ముందుగా ప్రభుత్వం పేర్కొన్న రెఫరల్ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుందని, చికిత్స కోసం ఉద్యోగులు ముందుగా అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆసుపత్రుల్లో కట్టాల్సి వస్తుందని, ఒకవేళ ఇంటికి పెద్ద అయిన ఉద్యోగి ఆసుపత్రిలో చేరితే చికిత్స కోసం డబ్బులు సర్దుబాటు చేసేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లచ్చిరెడ్డి తెలిపారు. పైగా రీయింబర్స్‌మెంట్ విధానాన్ని రూ.2 లక్షలకే పరిమితం చేసే సీలింగ్ ఉందని, చికిత్సకు అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే రిలాక్సేషన్ పొందేందుకు స్టాండింగ్ కమిటీని ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన తెలిపారు. చికిత్స కోసం అప్పులు తెచ్చి ఆసుపత్రుల్లో ఖర్చు చేసిన తర్వాత మళ్లీ ఆ డబ్బులను ప్రభుత్వం నుంచి తిరిగి పొందేందుకు (రీయింబర్స్‌మెంట్) ఏడాది నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతుందని, దీనివల్ల ఉద్యోగి ఇబ్బందులు పడుతున్నారని లచ్చిరెడ్డి మంత్రితో తెలిపారు.

పిఆర్సీ 2018 చేసిన సిఫార్సు
మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానంలో ఈహెచ్‌ఎస్ అమలు కోసం 2018 పిఆర్సీ ఒక ప్రతిపాదన చేసింది. ఈహెచ్‌ఎస్ కోసం ఉద్యోగుల, పింఛన్‌దారుల బేసిక్ పే నుంచి ఒక శాతాన్ని వసూలు చేయాలని సూచించింది. కొన్ని ఉద్యోగ సంఘాలు, కొందరు ఉద్యోగులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అధిక వేతనం ఉన్న వారి నుంచి 1 శాతం వసూలు చేయడం చాలా ఎక్కువని కొందరు ఉద్యోగులు ప్రభుత్వంతో పేర్కొనడంతో పాటు కుటుంబ సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలని వారు ప్రభుత్వానికి సూచించారు. మంత్రిని కలిసిన వారిలో కార్యక్రమంలో డా.నిర్మల, కె.రామకృష్ణ, డా.కత్తి జనార్దన్, దర్శన్ గౌడ్, ఎస్.రాములు, డా.వంశీకృష్ణ, దశరథ్, జయమ్మ, రమేష్ పాక, రామ్‌ప్రతాప్ సింగ్, గోవర్ధన్. పాండు, దీపక్ లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News