Friday, September 20, 2024

వారంలో 2 కిలోల బరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే, ఇలా చేయండి

- Advertisement -
- Advertisement -

ప్రస్తుత పరుకుల పరుగుల జీవనశైలిలో ప్రజలు తమ ఆరోగ్యం, పెరుగుతున్న బరువు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. వర్కవుట్ కోసం కొంత సమయాన్ని కేటాయించగలిగితే ఫిట్‌గా ఉండొచ్చు. అయితే వర్కవుట్స్ చేయలేక, పెరుగుతున్న బరువుతో చాలా మంది బాధపడుతుంటారు. దీంతో డైట్ ప్లాన్‌ని అనుసరించి కొంత బరువును తగ్గించుకోవాలని చూస్తుంటారు. ఇలాంటి వారు డైట్ ఫాలో అయితే.. కేవలం ఒక వారంలో 2 కిలోగ్రాముల బరువును తగ్గించుకోవచ్చని వైద్య నిపులు చెబుతున్నారు. మరి బరువు తగ్గాలంటే ఎలాంటి డైట్ ఫాలో కావాలో చూద్దాం..

ప్రతి రోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో మీ డేను ప్రారంభించాలి. ఉదయం పూట చల్లటి నీరు తాగకూడదు. మీరు ఉదయాన్నే జీలకర్ర నీరు, యాలకుల నీరు, సోపు, మెంతి నీరు త్రాగవచ్చు.

బ్రేక్ ఫాస్ట్: ఒక ఉడికించిన గుడ్డు, కొన్ని ఓట్స్ లేదా పోహా బ్రేక్ పాస్ట్ గా తీసుకోవచ్చు. ఇది ప్రోటీన్, పిండి పదార్థాలు రెండింటినీ అందిస్తుంది.

ప్రీ మీల్ స్నాక్స్: చాలా ఆకలిగా అనిపించకుండా ఉండటానికి, మీరు భోజనానికి ముందు కొన్ని గింజలు లేదా సీజనల్ పండ్లను తినవచ్చు. బరువు తగ్గడానికి మీ ఆహారంలో ఎలాంటి తీపి పదార్థాలను తీసుకోవద్దు.

మధ్యాహ్న భోజనం: పెరుగు, కూరగాయలు వంటి ఏదైనా ప్రోటీన్ మూలంతో మిల్లెట్ రోటీని తినవచ్చు. దీనితో పాటు, ఒక ప్లేట్ సలాడ్ తినాలి. బరువు తగ్గడానికి సలాడ్ చాలా ముఖ్యమైనది. సలాడ్ లో ఉండే ఫైబర్ వేగంగా కొవ్వును కాల్చేస్తుంది కాబట్టి బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

స్నాక్స్: సాయంత్రం గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ లేదా టీ తాగవచ్చు. దీనితో పాటు, కాల్చిన మఖానా, వేయించిన వేరుశెనగలు, కాల్చిన శెనగలు, మిల్లెట్ లేదా మరేదైనా ఆరోగ్యకరమైన స్నాక్స్ తినవచ్చు. ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తినకపోతే ఈ సమయంలో తినవచ్చు.

రాత్రి భోజనం: నిద్రవేళకు 3 గంటల ముందు డిన్నర్ చేయాలి. రాత్రి భోజనానికి తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తినాలి. రాత్రి భోజనంలో పప్పు, అన్నం, సలాడ్ తినొచ్చు. అన్నం బదులు ఒక రోటీ కూడా తినవచ్చు.

రాత్రి భోజనం చేసిన తర్వాత ఆకలిగా అనిపిస్తే, పడుకునే ముందు ఒక కప్పు పసుపు పాలు తాగాలి. ఇది మనిషిలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది.

రోజంతా 2-3 లీటర్ల నీరు త్రాగటం ముఖ్యం. సరైన మొత్తంలో నీరు త్రాగితే, ఆకలిని కూడా నియంత్రించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News