Wednesday, November 27, 2024

రికార్డు గరిష్ఠాల వద్ద ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 236.57 పాయింట్లు లేక 0.28 శాతం పెరిగి 83184.80 వద్ద ముగియగా, నిఫ్టీ 38.25 పాయింట్లు లేక 0.15 శాతం పెరిగి 25415.80 వద్ద ముగిశాయి.

నిఫ్టీ50 లో ప్రధానంగా ఎన్ టిపిసి, టైటాన్, నెస్లే ఇండియా, కొటక్ బ్యాంక్, టాటా కన్జూమర్ షేర్లు లాభపడగా, బిపిసిఎల్, కోల్ ఇండియా, ఓఎన్జిసి, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. నిఫ్టీలో 2866 స్టాకులు ట్రేడవ్వగా 906 షేర్లు లాభపడ్డాయి, 1882 షేర్లు నష్టపోయాయి.  78 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా ఉండిపోయాయి. 78 షేర్లు అప్పర్ సర్క్యూట్ ను తాకగా, 162 షేర్లు లోయర్ సర్క్యూట్ ను తాకాయి. కాగా 107 షేర్లు 52 వీక్ హై ని తాకగా, 44 షేర్లు 52 వీక్ లో ని తాకాయి. దేశీ మార్కెట్ సూచీలు రోజంతా లాభాల్లోనే కొనసాగడం విశేషం. పైగా రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి.

అమెరికా డాలరు మారకం విలువతో రూపాయి విలువను పోల్చి చూసినప్పుడు 0.08 పైసలు లేక 0.10 శాతం పతనమై రూ. 83.68 వద్ద ట్రేడయింది. ఇక 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ. 297.00 లేక 0.41 శాతం పెరిగి రూ. 73352.00 వద్ద ట్రేడయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News