Friday, September 20, 2024

పాకిస్తాన్, కాంగ్రెస్‌ది ఒకే పాట:అమిత్ షా

- Advertisement -
- Advertisement -

ఆర్టికల్ 370, 35ఎకి మద్దతునిస్తున్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతుగా పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన ప్రకటన ప్రతిపక్ష కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని మరోమారు బహిర్గతం చేసిందని కేంద్ర హోం మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి చెందిన పారీ, పాకిస్తాన్ బాణీ ఎప్పుడూ ఒకటేనని, జాతి వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కుమ్మక్కవుతూనే ఉందని కూడా ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఇటీవల ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ జమ్మూ కశ్మీరులో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి వైఖరి, పాకిస్తాన్‌లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ వైఖరి ఒకటేనని, అన్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణను తమ ఎన్నికల నినాదంగా ఆ కూటమి చేసుకుందని,

ఆర్టికల్ 370, 35ఎ విషయంలో తామంతా ఒకే వైఖరితో ఉన్నామంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై అమిత్ షా గురువారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ పాక్ రక్షణ మంత్రి ప్రకటనతో కాంగ్రెస్, పాకిస్తాన్ ఉద్దేశాలు, అజెండా ఒకటేనని మరోసారి వెల్లడైందని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తులకు మద్దతుగా ఉంటూ భారతీయుల మనోభావాలను గాయపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జరిపిన సర్జికల్ స్టైక్స్, వైమానిక దాడులకు రుజువులు అడగమే కాని భారత సైన్యంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే కాని కాంగ్రెస్ పార్టీ, పాకిస్తాన్ ఒకే తీరులో ఉన్నాయని అమిత్ షా ఆరోపించారు. జాతి వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ ఎప్పుడూ కుమ్మక్కవుతూనే ఉందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News