Tuesday, December 3, 2024

ఆ కేంద్రమంత్రి తల నరికి తెస్తే ఎకరంన్నర భూమి రాసిస్తా: కాంగ్రెస్ ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు తల నరికి తెచ్చిన వారికి తనకు ఉన్న భూమి రాసిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నంబర్ వన్ ఉగ్రవాది అంటూ కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను బిట్టు వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిట్టుపై ఫైర్ అయిన బిట్టు తల నరికి తెచ్చిన వారికి తనకు ఉన్న ఎకరం 38 గుంటల వ్యవసాయ భూమిని రాసిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News