Friday, September 20, 2024

నీట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట

- Advertisement -
- Advertisement -

హైకోర్టు:  నీట్ కౌన్సెలింగ్ లో స్థానికత విషయంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కౌన్సెలింగ్ సమయం తక్కువగా ఉండడంతో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

స్థానికత వ్యవహారంపై హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.  ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. స్థానికతను నిర్ధారిస్తూ నాలుగు రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని, అన్ని తీర్పులు స్పష్టంగా ఉన్నా, మళ్లీ స్థానికత విసయంలో కోర్టును ఆశ్రయించారని న్యాయమూర్తి తెలిపారు. ఈ ఒక్కసారికి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులను అనుమతించాలంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు విన్నవించుకున్నారు.

కేవలం రెండు మూడేళ్లు వేరే రాష్ట్రంలో చదువుకుంటే స్థానికతను దూరం చేయకూడదని విద్యార్థుల తరఫు న్యాయవాది వాదించారు. సమయాభావం కారణంగా కౌన్సెలింగ్ కు అనుమతించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తికి తెలిపారు. తదుపరి విచారణకు ప్రతివాదులందరికీ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. హైకోర్టును ఆశ్రియించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News