Friday, December 20, 2024

సిబిఐ ఆఫీస్‌కు బెంగాల్ జూడాల పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో తమ ‘పని నిలిపివేత’ను పాక్షికంగా ఉపసంహరించుకున్న జూనియర్ డాక్టర్లు క్రితం నెల ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ఒక ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై న్యాయం కోరుతూ శుక్రవారం కోల్‌కతా సాల్ట్ లేక్‌లోని సిబిఐ కార్యాలయం వద్దకు పాదయాత్ర జరిపారు. 41 రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను ముగిస్తూ జూనియర్‌డాక్టర్లు తమ విధుల పునరుద్ధరణను పాక్షికంగా ప్రారంభించనున్నట్లు గురువారం ప్రకటించారు. వారు శనివారం నుంచి

ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో అత్యవసర సర్వీసులకు హాజరు కానున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వాస్థ భవన్ సమీపంలో తమ పది రోజుల ధర్నా విరమణ సూచకంగా జూడాలు కేసులో దర్యాప్తును శీఘ్రంగా ముగించాలని కోరుతూ తమ నిరసన ప్రదేశం నుంచి సుమారు 4 కిమీ దూరంలోని సిజిఒ కాంప్లెక్స్‌కు పాదయాత్ర నిర్వహించారు. ‘హామీలు, వాగ్దానాలు నెరవేరని పక్షంలో మేము మా ఆందోళన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తాం’ అని నిరసనకారుడైన ఒక డాక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News