Saturday, September 21, 2024

కారులో దళిత బాలికపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో నడుస్తున్న ఒక కారులో ఒక దళిత బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారంచేసి, ఆమెను రోడ్డు పక్కన తోసివేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మైనర్ బాలిక తండ్రి ఫిర్యాదు దృష్ట్యా నిందితులపై ఒక ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు, ఆ ముగ్గురి కోసం గాలింపు జరుగుతున్నట్లు వారు తెలియజేశారు. సుమారు 13 ఏళ్ల ఆ బాలికను వైద్య పరీక్ష నిమిత్తం జిల్లా మహిళా ఆసుపత్రికి పంపినట్లు, ఆ తరువాత ఆమె ప్రకటనను మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయనున్నట్లు ఎస్‌పి (గ్రామీణ) త్రిగుణ్ బిసెన్ తెలిపారు. బాలిక తండ్రి దాఖలు చేసిన ఫిర్యాదును ఎస్‌పి ఉటంకిస్తూ, గురువారం ఉదయం అల్పాహారం కోసం సరకుల కొనుగోలుకు

తమ ఇంటి దగ్గరలోని ఒక దుకాణానికి మైనర్ వెళ్లినప్పుడు ఆ ఘటన జరిగిందని తెలియజేశారు. దుకాణం వద్ద నీరజ్ అనే వ్యక్తి మత్తు పదార్థాలు కలిపిన నీటి సీసాను ఆమెకు ఇచ్చినట్లు, ఆమె నీటిని తాగగానే ఆమెకు కళ్లు తిరగసాగినట్లు, స్పృహ కోల్పోయినట్లు ఫిర్యాదు పేర్కొన్నది. నీరజ్, అతని మిత్రుడు శైలేంద్ర, మరొక అనుచరుడు ఆమెను కారులో తీసుకువెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నడుస్తున్న కారులోనే వారు పూర్తిగా స్పృహ కోల్పోని ఆమెపై అత్యాచారం చేసి, బర్సానా రోడ్డు ఫ్లై ఓవర్‌పై ఆమెను కారులో నుంచి తోసివేసి పారిపోయినట్లు తెలుస్తోంది. స్పృహలోకి వచ్చిన తరువాత బాలిక ఇంటికి వెళ్లి ఆ ఘటన గురించి తన తల్లిదండ్రులకు చెప్పినట్లు ఫిర్యాదు పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News