Monday, November 25, 2024

గ్రీన్ కార్డు వ్యాలిడిటీ పెంచిన అమెరికా

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: శాశ్వత నివాస కార్డు( గ్రీన్ కార్డు) వ్యాలిడిటీని మూడు సంవత్సరాలకు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. గతంలో గ్రీన్ కార్డు గడువు తీరిపోయినప్పటికీ…మరో రెండు సంవత్సరాలు దాని వ్యాలిడిటీని పొడగిస్తుండేవారు. అయితే ఇప్పుడు మూడు సంవత్సరాలు పెంచినట్లు పౌరసత్వ, వలసల సేవా సంస్థ(యుఎస్సిఐఎస్) వెల్లడించింది.

సాధారణంగా గ్రీన్ కార్డు హోల్డర్లు ప్రతి పదేళ్లకోసారి రెన్యూవల్ చేసుకుంటుండాలి. గడువుతీరిపోతే ఆరు నెలల ముందే ఐ-90 ఫామ్ పూర్తిచేయాలి. రెన్యూవల్ కోసం అప్లయ్ చేసుకున్న వారికి ఓ రశీదు ఇస్తారు. దానిని కొత్త కార్డు జారీ అయ్యే వరకు ఉద్యోగాలు, ప్రయాణాల సమయంలో చట్టబద్ధత హోదా ఆధారంగా చూయించొచ్చు. అయితే ఇప్పుడు గ్రీన్ కార్డు వ్యాలిడిటీని మూడు సంవత్సరాలు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News