Friday, December 20, 2024

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిషి ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఆతిషి శనివారం ఢిల్లీ లోని రాజ్ నివాస్ లో  ముఖ్యమంత్రిగా ప్రామాణస్వీకారం చేశారు. ఆమె తో పాటు కొత్తగా ఐదుగురు మంత్రులు సౌరభ్ భారద్వాజ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాష్ గెహ్లాట్, ముకేశ్ అహ్లావత్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఇదిలావుండగా అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సెనాకు ఈ వారం మొదట్లో  అందజేశారు. ఆప్ లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా తానెన్నికైనట్లు ఆతిషి లేఖను గవర్నర్ కు అందజేసింది. తదనంతరం సెప్టెంబర్ 21 ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం తేదీని సక్సెనా ప్రతిపాదించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి, హోం వ్యవహారాల మంత్రికి తెలిపారు.

ఆతిషి పాలనపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.ఆమె కీలకమైన ఆర్థిక, విద్య, పిడబ్ల్యుడి, విద్యుత్తు శాఖలను తన పోర్ట్ ఫోలియోలో ఉంచుకోనున్నట్లు సమాచారం. ఏ శాఖ చేపట్టని అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలు, ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. కొత్త క్యాబినెట్ చాలా శ్రమించనున్నట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News