Monday, January 20, 2025

శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై భారీ తగ్గింపు

- Advertisement -
- Advertisement -

సెల్‌ఫోన్ వినియోగదారులకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ శుభ వార్త చెప్పింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా భారీ డిస్కౌంట్‌తో తన గెలాక్సీ ఎస్ 24 ఫోన్ అందించేందుకు సంస్థ సిద్ధమైంది. ఫెస్టివల్ ప్రమోషన్ ప్రైస్ కింద ధర తగ్గిస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. కంపెనీ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో రూ. 60 వేల లోపు ధరకు శాంసంగ్ గెలాక్సీ ఎస్ సీరీస్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. గత జనవరిలో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ 8 జిబి ర్యామ్ విత్ 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 74999 కాగా, ఇప్పుడు రూ. 59999 ధరకే లభిస్తుంది.

బ్యాంక్ ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ రూ. 12 వేలతో పాటు అప్‌గ్రేడ్ బోనస్ రూ. 3 వేలతో ధర తగ్గుతుంది. ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ కింద రూ. 40 వేల వరకు శాంసంగ్ రాయితీ అందిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ లిస్టింగ్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ రూ. 57490 ధర పలుకుతోంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద రూ. 24250 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News