Sunday, December 22, 2024

జమిలి ఎన్నికలు..ఒక దేశం ఒక పార్టీ కోసమా?

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ఖర్చు ఇప్పుడు ఎంత అవుతుందనుకుంటున్నా రు? ఊహాగానాలు అవసరం లేదు. మనం ప్రతి ఎన్నికల్లో చూ స్తూనే ఉన్నాం. గ్రామ పంచాయితీల దగ్గర నుండి పార్లమెంటు ఎన్నికల దాకా సామాన్యుడు ఎవడూ పోటీ చేయడానికి సాహ సించనంతగా ఎన్నికల ఖర్చులు పెరిగిపోయాయి. గ్రామ పం చాయితీ ఎన్నికలలో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న వాళ్ళు కనీసం కోటి రూపాయలు ఖర్చు చేస్తున్న సందర్భాలు మన కళ్ల ముం దు కనబడుతున్నాయి. ఇక శాసనసభ, లోకసభ ఎన్నికల ఖ ర్చుల గురించి చెప్పాల్సిన పని లేదు. శాసనసభకు పోటీ చేసే అభ్యర్థ్ధి అధమపక్షం 50 కోట్లు, లోకసభకు పోటీ చేసే అభ్య ర్ధులు మూడు నాలుగు వందల కోట్ల వరకూ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నేడు నెలకొనిఉంది. మన రాజకీయ నాయకులు బహి రంగంగా ఒప్పుకోరు.. ఎక్కువ ఖర్చు చేసినట్టు ఎన్నికల సం ఘానికి తెలిస్తే అనర్హత వేటు పడుతుందని, ఆదాయపు పన్ను శాఖ లెక్కలు అడుగుతుందనీ.

ఎన్నికలలో అభ్యర్థులు, పార్టీలు పెట్టే ఖర్చు విషయంలో మన తెలుగు రాష్ట్రాలతో పోల్చితే మిగతా దేశమంతటా కొంచెం మె రుగయిన పరిస్థితే ఉంటుంది. ఉత్తరాదిలో ఎన్నికలు మరీ ఇం త ఖరీదు అయిపోలేదని చెపుతుంటారు. ఒక బడా కాంట్రాక్టర్ స్వయంగా చెప్పిన మాట మేం ఉత్తరాదిలో కూడా కాంట్రాక్టు లు చేస్తాం, అక్కడ రాజకీయ నాయకులకు లక్షల్లో ముడుపులి స్తే మహా సంతోషపడి పోతుంటారు, మన ముందు చేతులు క ట్టుకుని నిలబడతారు. ఇక్కడైతే కోట్లల్లో.. అదీ ఒకటి, రెండు కాదు.. వందల కోట్లలో ఇచ్చుకోవాలి అని. ఎన్నికల ఖ ర్చులు ఎలా పెరిగితే అలా ముడుపులు కూడా పెరగాల్సిందే కదా.
మితిమీరిన ఎన్నికల వ్యయానికి సంబంధించి తెలంగాణాలో రెండు ఉదాహరణలు చెపుతుంటారు. ఉమ్మడి కరీంనగర్ , నల్లగొండ జిల్లాల్లో వరుసగా రెండు సంవత్సరాలు రెండు ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చింది.

2021 లో అప్పటి అధికార భా రత రాష్ట్ర సమితి బహిష్కరణకు గురైన సీనియర్ నాయ కుడు ఈటల రాజేందర్ రాజీనామా కారణంగా హుజూరాబా ద్‌లో, 2022లో కాంగ్రెస్ నుంచి వైదొలగిన కారణంగా శాసన సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయ డంతో మునుగోడులో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నిక లలో హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గె లిస్తే, మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు. ఈ రెండు నియోజకవర్గాల ఉపఎన్నికలూ భారతదేశ ఎన్నికల చరిత్రలో గుర్తుండిపోతాయి. అందుకు కా రణం ఆ రెండు ఉప ఎన్నికలలో అధికార, ప్రతిపక్షాలు పెట్టిన వందల కోట్ల రూపాయల ఖర్చు, అవి ఇచ్చిన అలవిమాలిన హామీలు గతంలో ఎప్పుడూ చూసి ఉండం. భవిష్యత్తులోనూ చూడకపోవవచ్చు. ఈ రెండు ఉపఎన్నికలలో తలపడిన రెండు ప్రధాన పార్టీలు అప్పట్లో ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇంకోకటి కేంద్రంలో అధికారంలో ఉన్నది.

ఉప ఎన్నికలు కాబట్టి అంత ఎక్కువ ఖర్చు అయి ఉంటుందని రాజకీయ పార్టీలు సమర్ధించుకోవచ్చు. సాధారణ ఎన్నికల్లో కూడా ఎన్నికల వ్యయం ప్రారంభంలో చెప్పుకున్నట్టు వందల కోట్లకు తగ్గేదేలే అన్నట్టుగానే కొనసాగుతున్నది పరిస్థితి. ఇక ఎన్నికల్లో ఇతర అంశాల విషయానికి వస్తే హింసను గురించి, ఇతర అక్రమాలను గురించి ఇంకో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్ర దేశ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రెండే కాదు ఆంధ్ర ప్రదేశ్ ను ఉదాహరణగా తీసుకున్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిష్క్రియాపరత్వాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఎన్నికల సంద ర్భంగా అక్కడ కొన్నిచోట్ల జరిగిన హింసాకాండ, పోలింగ్ లో జరిగిన అక్రమాలను ఎన్నికల సంఘం అడ్డుకోలేకపోయింది. దేశం మొత్తంలోనే దాదాపు 75 లోకసభ నియోజకవర్గాలలో పోల్ అయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ అని వచ్చిన ఫిర్యాదుల మీద ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. ఇలా జరిగిన వాటిలో తగినన్ని నియోజకవ ర్గాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉన్నాయి. ఎన్నికలసంఘం అనే ఒక స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించాల్సిన వ్యవస్థ మీద జనానికి నమ్మకం పోయే పరిస్థితి ఇది.

ఈ సోది అంతా ఇప్పు డెందుకు, సందర్భం ఏమిటి అంటే రెండు, మూడు రోజుల క్రి తం కేంద్ర మంత్రిమండలి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిం ద్ నేతృత్వంలోని ఒక కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించడ మే కారణం. రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఇది ఉభయ సభల ముందుంచి ఆమోదింప చేసుకుంటామని కూడా కేంద్ర మంత్రి మండలి ప్రకటించింది. ఈ నివేదిక ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అన్న అంశానికి సంబంధించి. కొన్ని వేల పే జీల ఈ నివేదిక ఒక సంవత్సర కాలంలో దేశంలో ఎవరిని సంప్రదించి, ఎలా తయారు చేశారో తెలియదు. రామ్ నాథ్ కోవింద్ కమిటీని కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్ మాసం లో ఏర్పాటు చేసింది. సరిగ్గా సంవత్సరం తిరగకుండా నివేదిక ఇచ్చేశారు. దేశం అంతటా శాసనసభలకు, లోకసభకు ఒకేసా రి ఎన్నిక జరపడం మంచిదన్నది ఈ నివేదిక చేసిన సిఫార్సు. అది మొదటి దశ అయితే రెండో దశ దేశంలోని స్థానిక సంస్థల న్నీటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం.

ఇలా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ప క్షం చూపుతున్న ప్రధానకారణం ఎన్నికల వ్యయం కాగా ఐ దేళ్లూ దేశంలోని ఏదో ఒక మూల ఎన్నికలు జరుగుతుంటే అ భివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున కుంటుపడుతున్నదన్న కారణం రెండవది. ‘ఒ కే దేశం- ఒకే ఎన్నిక’ మంచి చెడుల చర్చలోకి పోయే ముందు ఒక్క విషయం మాట్లాడుకోవాలి. మన పాలకులకు అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం తగ్గిపోతున్నదనడానికి ఒక మంచి ఉదాహరణ ఈ కమిటీకి రామ్ నాథ్ కోవింద్ ను అధ్య క్షుడిగా నియమించడం. ఆయన పూర్వం రాజకీయ నాయకు డే కావచ్చు కానీ ఒకసారి అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించిన తరువాత ఈ పనికి నియమించి ఉండాల్సింది కాదు. ఆయన కూడా ఒప్పుకోవలిసింది కాదు. ఇది రాష్ట్రపతి పదవి గౌరవాన్ని తగ్గించినట్టు అయింది.

ఇక దేశమంతటా ఒకేసారి ఎన్నికలు అనే అంశానికి వస్తే రాజ కీయ పక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో ఫెడరల్ స్పూర్తికి విఘాతం కలిగించే రాజకీయ కుట్రగా భా విస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల మనుగడకు నష్టం వాటిల్లే రీతి లో ఉంది ఇది అని కూడా కొన్ని రాజకీయ పక్షాలు భావిస్తున్నా యి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో ఈ చర్య స రైంది కాదంటున్నాయి. నిజమే, మన దేశంలో భిన్న సంస్కృ తులు, భాషలూ, సాంప్రదాయాలు ఆచరణలో ఉన్నాయి.
అదలాఉంచితే , 2029 ఎన్నికలకు ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ పద్ధతి తీసుకురావాలన్న తొందరలో కేంద్రం ఉన్నట్టు కనిపిస్తు న్నది. అదెలా సాధ్యపడుతుందో ఆలోచించాలి. ఇది అమలు కావడానికి ముందు చాలా తతంగం ఉంది. కనీసం 18 రా జ్యాంగ సవరణలు అవసరం అవుతాయి. పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుత ఎన్డీఏ కూటమి అది సాధించే పరిస్థితి ఉందా? కనీసం దేశం లోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని ప్రభుత్వాలలో సగం అయిన ఆమోదించాలి.

ఇంత తతంగం పూర్తి చేసుకుని ‘ఒకే దేశం’ ఒకే ఎన్నిక’ ప్రయోగం అమలు చేస్తారనుకుం దాం. ఏ కారణం చేతనయినా ఒక రాష్ట్రంలోనో, కొన్ని రాష్ట్రాల లోనో ప్రభుత్వాలు అర్థంతరంగా పతనం అయితే ఏమిటి మార్గం? వాటికి మిగిలిన కాలానికి ఎన్నికలు నిర్వహిస్తామం టే ఎన్నికయిన ప్రభుత్వాలకు అయిదేళ్ళ పదవీకాలం ఉండా లన్న నియమం మాటేమిటి?
ఇక్కడే ఆరంభంలో మాట్లాడుకున్న ఎన్నికల వ్యయం , హింస , అక్రమాల ప్రస్తావన అవసరం అవుతున్నది. చాలాకాలంగా దేశంలో ఎన్నికల సంస్కరణల గురించి పెద్దయెత్తున చర్చ జరు గుతున్నది. ఎన్నికలలో ధనం, మద్యం తదితర ప్రలోభాలను కట్టడి చేయడానికి, హింసని కఠినంగా అణచివేయడానికి, ఇత ర అక్రమాలను అరికట్టడానికి పకడ్బందీగా సంస్కరణలు తీ సుకువచ్చి ఎన్నికల్లో ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పే ఆలోచన మానేసి ఈ ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ ప్రయోగం చేయ డం సరయింది కాదు.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రయోగం మీద స్పందిస్తూ అన్న మాటలను గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు దేశానికి తక్షణ అవసరం ఒకే దేశం ఒకే విద్య , ఒకే దేశం ఒకే వైద్యం అన్నారు కేజ్రీవాల్. ఒక దేశంలో నివసించే వారందరికీ పేద గొప్ప తారతమ్యాలు లేకుండా ఒకే రకమయిన విద్య, వైద్య సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేయా లని అర్ధం. అంతేకానీ ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అన్న ఆలోచన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News