- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు.. స్థానిక ఎన్నికలపై నాయకులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్సీ సమావేశం జరగనుంది.
ఆదివారం సాయంత్రం 4గంటలకు మాదాపూర్ లోని ట్రెడెంట్ హోటల్లో జరగనున్న ఈ సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు తీరుపై సమావేశంలో సమీక్షించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధత్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
- Advertisement -