Friday, November 22, 2024

విద్యా సంస్థల కోసం ‘డైరెక్ట్ ఫండింగ్’ పథకాన్ని ప్రకటించిన ఆక్సిలో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆక్సిలో ఫిన్‌సర్వ్‌లోని ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషనల్ లోన్ (ఈఐఎల్) వ్యాపార విభాగం పాఠశాలలు మరియు విద్యాసంస్థలు సౌకర్యాల అభివృద్ధికి నిధుల అవసరాల కోసం నేరుగా తమను చేరుకోవడంలో సహాయపడేందుకు ‘డైరెక్ట్ ఫండింగ్’ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ‘డైరెక్ట్ ఫండింగ్’ పథకం కింద, తమ వెబ్‌సైట్ www.auxilo.com ద్వారా నేరుగా తమను చేరుకునే పాఠశాలలు, విద్యా సంస్థలకు ప్రాసెసింగ్ ఫీజులో 25% తగ్గింపును ఆక్సిలో ఫిన్‌సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తుంది. ఈ ఆఫర్ భారతదేశం అంతటా అందుబాటులో ఉంది.

“పాఠశాలలు, కళాశాలల వంటి విద్యాసంస్థలు తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ఆధునీకరించడానికి, ఉత్తమ బోధనా పద్ధతులను అవలంబించడానికి, అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని పెంపొందించడానికి నిధులు అవసరం. అత్యాధునిక బోధనా సౌకర్యాలను కల్పించుకోవటం లో ఈ సంస్థలకు సహాయపడటానికి ఆర్థిక వనరులను అందించడం ద్వారా భారతదేశం అంతటా పాఠశాలలతో భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు మేము గర్విస్తున్నాము” అని ఆక్సిలో ఫిన్‌సర్వ్ ఎండి & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీరజ్ సక్సేనా తెలియజేశారు.

ఆక్సిలో ఈఐఎల్ వ్యాపార విభాగం ప్లే /ప్రీ-స్కూల్స్, కె -12 పాఠశాలలు, బోర్డింగ్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తి విద్యా కళాశాలలు, నైపుణ్య-ఆధారిత శిక్షణ మరియు కోచింగ్ సంస్థలపై దృష్టి సారించే విద్యా సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. నూతన విద్యా విధానం 2020 పరిచయంతో, విద్యార్థులకు సర్వతోముఖాభివృద్ధి మార్గాలను అందించడానికి డిజిటల్ మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలు, లైబ్రరీలు, పారిశుధ్యం, క్రీడా సామర్థ్యాలను మెరుగుపరుచుకోవటానికి పాఠశాలలు తమ మౌలిక సదుపాయాలను పెంచుకోవాల్సిన ఆవశ్యకత పెరిగింది. హైదరాబాద్‌లోని బచ్‌పన్ అకడమిక్ హైస్కూల్ ఎడ్యుప్రెన్యూర్ గంగు గెథా రెడ్డి మాట్లాడుతూ “భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటానికి, మేము మా క్యాంపస్‌ని విస్తరించాలి మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచటానికి మా ప్రస్తుత సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయాలి. మేము ఆక్సిలో ఫిన్‌సర్వ్ తో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా అన్ని అభివృద్ధి ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించగలిగాము” అని అన్నారు.

ఆక్సిలో ఈఐఎల్ వ్యాపారం దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అంతటా విస్తృత శ్రేణిలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్‌లలో రుణాలను అందించడం ప్రారంభించింది.

” ఫైనాన్షియల్ ఫెసిలిటేటర్ కంటే ఎక్కువగా ఆక్సిలో ఉంది, మా అవసరాన్ని, నాణ్యమైన విద్యను అందించడానికి మా పాఠశాలల విస్తరణకు ఉన్న అవకాశాన్ని అర్థం చేసుకుంటుంది” అని హైదరాబాద్‌లోని లిటిల్ టులిప్స్ హైస్కూల్ ఎడ్యుప్రెన్యూర్ మహ్మద్ ఒబైద్ అహ్మద్ తెలియజేశారు. “సామర్థ్య పెంపుదల, ప్రాంగణాల విస్తరణ కోసం భూమి కొనుగోలు, బోధనా సౌకర్యాల మెరుగుదల, అధిక వ్యయంతో కూడిన రుణాల భర్తీ కోసం విద్యా సంస్థల అవసరాలను తీర్చడానికి మేము విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తాము” అని శ్రీ నీరజ్ శర్మ, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ – విద్యా సంస్థ రుణాలు, ఆక్సిలో ఫిన్‌సర్వ్ అన్నారు. ఆక్సిలో ఫిన్‌సర్వ్ రాబోయే 5 సంవత్సరాలలో 10,000 పాఠశాలలకు ఆర్థిక సహాయాన్ని అందించాలని యోచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News