Friday, November 22, 2024

చిరంజీవికి సిఎం రేవంత్ ప్రత్యేక అభినందనలు

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవికి సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. హీరో చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ చోటు దక్కడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించ దగ్గ విషయమని చెప్పారు. ఈ శుభ సందర్భంలో వారికి అభినందనలు తెలియ జేస్తున్నానని సిఎం రేవంత్ ట్వీట్ చేశారు. కాగా టాలీవుడ్ ప్రముఖ హీరో, పద్మవిభూషన్ చిరంజీవి తన సినీ కెరీర్ లో 156 సినిమాల్లో 24 వేల డాన్స్ స్టెప్పులేసి.. అత్యధిక డాన్స్ స్టెప్పులేసిన జాబితాలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నారు. అంతేగాక ఈ అవార్డ్ దక్కించుకున్న మొదటి నటుడుగా చిరంజీవి రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

చిరంజీవిని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
చిరంజీవిని యువత ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాక.. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న కొణిదెల చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్‌లో చోటు దక్కించు కోవడం గర్వకారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిందని ఆయన అభినందించారు. స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను చేరుకున్న చిరంజీవిని యువత ఆదర్శంగా తీసుకొవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు..

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News