- Advertisement -
దక్షిణ కొరియాకు పారిపోవాలనుకున్న కొంతమందికి సహకరించారన్న నేరారోపణపై కిమ్‌జోంగ్ ఉన్ ప్రభుత్వం ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష విధించింది. చైనాలో ఉంటున్న ఆ ఇద్దరు మహిళలను స్వదేశానికి రప్పించి మరీ ఈ ఉరిశిక్షను అమలు చేసింది. ఉత్తర కొరియాకు చెందిన రీ, కాంగ్ అనే ఇద్దరు మహిళలు చైనాలో నివాసం ఉంటున్నారు. అయితే దక్షిణ కొరియాకు పారిపోవానుకున్న కొందరు ఉత్తర కొరియా వాసులకు ఆ ఇద్దరు సహకరించారు. ఈ సంగతి కిమ్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆ ఇద్దరు మహిళలు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించింది. బహిరంగ విచారణ జరిపి కొన్ని రోజుల క్రితం ఉరితీసింది. ఇటువంటి అభియోగాలతో మరో తొమ్మిది మంది మహిళలకు జీవిత ఖైదు విధించింది.
- Advertisement -