Friday, November 22, 2024

మార్క్సిస్ట్ నేతకు శ్రీలంక పగ్గాలు

- Advertisement -
- Advertisement -

మార్కిస్ట్ నేత అనుర కుమార దిసనాయకె శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విజేత అని దేశ ఎన్నికల కమిషన్ ఆదివారం ప్రకటించింది. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా రెండవ రౌండ్ వోట్ల లెక్కింపు జరిపిన తరువాత కమిషన్ ఈ ప్రకటన చేసింది. మార్కిస్ట్ జనతా విముక్తి పెరమున (జెవిపి)కి చెందిన నేషనల్ పీపుల్స్ పవర్ (పిపిపి) అభ్యర్థి దిసనాయకె (56) తన సమీప ప్రత్యర్థి సమగి జన బలవెగాయ (ఎస్‌జెబి)కి సాజిత్ ప్రేమదాసను ఓడించారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె వోటు జాబితాలో మొదటి రెండు స్థానాల్లో లేకపోవడంతో మొదటి రౌండ్‌లో నుంచే నిష్క్రమించారు. కాగా, దిసనాయకె సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్‌పిపి తెలియజేసింది. ఆయన శ్రీలంకకు తొమ్మిదవ అధ్యక్షుడు. శ్రీలంక చరిత్రలో ప్రప్రథమంగా అధ్యక్ష ఎన్నిక ఆదివారం రెండవ రౌండ్ గణనకు వెళ్లింది. విజేతగా ప్రకటించడానికి కావలసిన 50 శాతం పైగా వోట్లు శనివారం ఎన్నికలో ఏ అభ్యర్థికీ రాకపోవడం వల్ల ఎన్నికల కమిషన్ రెండవ రౌండ్ లెక్కింపును ఆదేశించింది. శ్రీలంకలో ఏ ఎన్నికలూ రెండవ రౌండ్ లెక్కింపు వరకు వెళ్లలేదు. ఎందుకంటే మొదటి ప్రాధాన్య వోట్ల ఆధారంగానే అభ్యర్థులు స్పష్టమైన విజేతలుగా ఆవిర్భవించారు.

ఎవరీ దిసనాయకె?
సాధారణ నేపథ్యం నుంచి శ్రీలంక సారథ్యం వరకు ఎదిగిన మార్కిస్ట్ నేత దిసనాయకె. సాంప్రదాయక రాజకీయ నేతల ‘అవినీతి రాజకీయాలకు’ విసుగు చెందినవారికి, యువ వోటర్లకు మార్పు తెచ్చే నేతగా ఆయన తనను తాను పరిచయం చేసుకున్నారు. దీర్ఘ కాలం నామమాత్రంగా ఉండిపోయిన అర్ధ శతాబ్ది పారీ జెవిపికి ఆయన ఉత్థానం గణనీయమైన విజయం. దేశాధినేత కానున్న శ్రీలంక ప్రప్రథమ మార్క్సిస్ పార్టీ నేత దిసనాయకె. ఆర్థిక సంక్షోభం నాటి నుంచి వ్యవస్థలో మార్పు కోరుతున్న యువ వోటర్లను దిసనాయకె అవినీతి వ్యతిరేక సందేశం, రాజకీయ సంస్కృతిలో మార్పు తెస్తాన్న వాగ్దానం ఆకట్టుకున్నాయి. నార్త్ సెంట్రల్ ప్రావిన్స్‌లోని గ్రామీణ తంబుట్టెగమకు చెందిన దిసనాయకె కొలంబో శివార్లలోని కెలనియ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ పట్టభద్రుడు. ఎన్‌పిపి భారత వ్యతిరేక తిరుగుబాటు ఉద్యమం సాగిస్తున్న సమయంలో 1987లో ఆ పార్టీ అంతర్భాగమైన జెవిపిలో చేరారు. 1987 భారత లంక ఒప్పందాన్ని సమర్థించిన అన్ని ప్రజాస్వామిక పక్షాల నాయకులు అనేక మందిని జెవిపి నిర్మూలించింది.

అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో దిసనాయకె భారత పర్యటన భారత్ పట్ల ఎన్‌పిపి నాయకత్వం దృక్పథంలో మార్పు తెచ్చింది. విదేశీ పెట్టుబడుల పట్ల ఆసక్తి కనబరచింంద. జెవిపి 1990 దశకం చివర్లో ప్రజాస్వామ్య రాజకీయాలలోకి ప్రవేశించడంతో దిసనాయకె జెవిపి కేంద్ర కమిటీలో స్థానం పొందారు. 2000 పార్లమెంటరీ ఎన్నికల్లో ఆయన జెవిపి తరఫున పార్లమెంట్‌లో ప్రవేశించారుఏ. 2004లో తిరిగి పార్లమెంట్‌కు ఎన్నికైన దిసనాయకె 2008లో జెవిపి పార్లమెంటరీ గ్రూప్ నేత అయ్యారు. ఆయన 2010లో తిరిగి పార్లమెంట్‌కు ఎన్నికైన దిసనాయకె 2014లో తన పార్టీ చీఫ్ అయ్యారు. 2015లో కొలంబో నుంచి తిరిగి ఎన్నికైన దిసనాయకె 2019లో ప్రతిపక్షం చీఫ్ విప్ అయ్యారు. జెవిపి 2019లో ఎన్‌పిపిగా పేరు మార్చుకున్నది, ఇది ఇలా ఉండగా, నగదు కొరత ఎదుర్కొంటున్న దేశంలో ఆర్థిక సంస్కరణల భవితవ్యాన్ని తేల్చవలసిన తక్షణ సవాల్ దిసనాయకె ముందు ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News