Monday, September 23, 2024

హైడ్రా హైస్పీడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో/ కూకట్‌పల్లి/అమీన్‌పూర్ : అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. అనధికారికంగా నిర్మించిన అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూ ల్చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే హైడ్రా అధికారులు కూల్చివేతల ద్వారా హెచ్‌ఎండిఏ పరిధిలోని మూడు ప్రాం తాల్లో సుమారు 8 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నా రు. అమీన్‌పూర్‌లో పోలీసు బలగాల పహారాతో కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడ ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ ని ర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి. ఉద యం7 గం.ల నుంచి మొదలైన కూల్చివేతలు రాత్రి 10 గంటల తర్వాత కూడా కొనసాగాయి. హైడ్రా డిఎస్‌పి శ్రీనివాస్ నేతృత్వంలో అమీన్‌పూర్ తహసిల్దార్, మున్సిపల్ క మిషనర్ జ్యోతి రెడ్డి పర్యవేక్షణలో కూల్చివేతలు జరిగా యి.

పటేల్ గూడా సర్వేనెంబర్ 12లో నిర్మించిన 30 ఇళ్లతోపాటు కిష్టారెడ్డిపేట్ స ర్వేనెంబర్ 164లో తప్పుడు ప త్రాలతో ఆక్రమించి నిర్మించి న 3 వాణిజ్య సముదాయాల ను హైడ్రా కూల్చేసింది. దాదా పు 100 మంది పోలీసులు, డిఆర్‌ఎఫ్, జిహెచ్‌ఎంసి సిబ్బందితో ఏకకాలంలో రెండు చోట్ల కూల్చివేతలు చేపట్టింది హై డ్రా క్రిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ 12లో ప్రభుత్వ స్థలాన్ని ఆ క్రమించి నిర్మించిన వాణిజ్య సముదాయాలను నేలమట్టం చేశారు. సదరు అక్రమ నిర్మాణదారుడు గతంలో సైతం రెవెన్యూ అధికారులకు అనేక విధాలుగా రాజకీయ సభ్యులతో ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టకుండా అడ్డుకునే ప్రయ త్నం చేసి సఫలీకృతమైనప్పటికీ హైడ్రా అధికారుల జోక్యం తో అక్రమనిర్మాణాలు కూలక తప్పలేదు.

వాయిదా పడిన ఐలాపూర్
అమీన్‌పూర్ పరిధిలోని ఐలాపూర్ సర్వేనెంబర్ 208 లో ఆక్రమించిన నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు నిర్ణయించినప్పటికీ సమ యం మించి పోవడంతో ఐలాపూర్‌లోని అక్రమ నిర్మాణాలను వాయిదా వేసినట్టు తెలిసింది. ఐలాపూర్‌లో దాదాపు మూడు ఎకరాల స్థలాన్ని ఆక్రమించి క్రిష్టారెడ్డిపేట్ శ్రీరామ్ నగర్ కాలనీ సర్వే నెంబర్ తో పత్రా లు సృష్టించినట్టు అధికారులు గుర్తించారు. వీటిని త్వరలోనే హైడ్రా అధికారులు కూల్చి వేయనున్నట్లు సమాచారం. కూకట్‌పల్లి నల్ల చెరువు మొత్తంవిస్తీర్ణం 27 ఎకరాలుగా ఉంది. కూకట్ పల్లి గ్రామం బాలానగర్ మండలపరిధిలోని సర్వే నంబరు 66,67,68,69 లలో చెరువు విస్తరించి ఉం ది. ఈ చెరువులో మొత్తం 16 (వాణిజ్యషెడ్లు, ప్రహరీగోడ లు) కూల్చివేసి 4 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు.

అలాగే కిష్టారెడ్డిపేటలోని ప్రభుత్వభూమిలో ఆక్రమణలను తొలగించి సర్వేనంబరు 164లోని 3 భవనాలు జీ+4 అంతస్థులు నేలమట్టంచేసి ఒక ఎకరం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. పటేల్‌గూడ ప్రభుత్వభూమి సర్వేనంబర్ 12/2, 12/3లో 25 ఆర్‌సిసి నిర్మాణాలు జీ+1 అంతస్థులను తొలగించి 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆక్రమణలను తొలగించడంద్వారా హైడ్రా సుమారు 8 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

బాధితులు వేడుకున్నా : కూకట్‌పల్లి సర్కిల్‌లోని నల్ల చెరువుకు ఆదివారం ఉ. 6 గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు, మునిసిపల్ రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున చేరుకుని ఇదివరకే నోటీసులు జారీ చేసిన సుమారు 16 అక్రమ షెడ్లను కూల్చివేశారు. ఈ సందర్భంగా బాధితుల ఆర్తనాదాలతో విలపిస్తూ లబోదిబోమన్నారు. ముందుగా నోటీసులు ఇవ్వలేదని, అసలు వారు లీజుకు తీసుకున్న సమయంలో అది ఎఫ్‌టిఎల్ పరిధి, బఫర్ జోన్ అని తెలియని వాపోయారు. కనీసం సామాన్లు తీసుకువెళ్లే సమయాన్ని ఇవ్వకపోవడంతో పెద్ద మొత్తంలో నష్టంవాటిల్లి రోడ్డుపై పడ్డామన్నారు. పలువురు బాధితులు ఆత్మహత్యలే తమకు శరణ్యమని, మరికొందరు షెడ్లలో తమను పెట్టి కూల్చివేయాలని అడ్డుకున్నారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించి ఆ షెడ్లను కూల్చివేశారు. ఆక్రమణల నుంచి నల్ల చెరువును కాపాడాలని పలువురు నియోజకవర్గ నేతల విజ్ఞప్తులకు స్పందించి అధికారులు కళ్లు తెరిచి కూల్చివేయడంతో సంతోషం వ్యక్తంచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News