Tuesday, September 24, 2024

కేజ్రీవాల్ కుర్చీలో కూర్చోని ఆతిశీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అయోధ్య సింహాసనంపై శ్రీరాముడి పాదుకలను ఉంచి భరతుడు పాలించిన విధంగానే తాను కూడా పరిపాలన సాగిస్తానని 8వ ముఖ్యమంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఆతిశీ ప్రకటించారు. ముఖ్యమంత్రిగా గతంలో అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించిన కుర్చీలో ఆమె కూర్చోకుండా ఆ కుర్చీని ఖాళీగా ఉంచి పక్కన వేరే కుర్చీలో ఆమె కూర్చున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కేజ్రీవాల్ ఉపయోగించిన కుర్చీ ఖాళీగా ఉంటుందని ఆతిశీ తెలిపారు.

కాగా..ముఖ్యమంత్రికి ఉద్దేశించిన కుర్చీలో కూర్చోకుండా వేరే కుర్చీలో ఆతిశీ కూర్చోవడంపై బిజెపి ఢిల్లీ అధ్‌యోడు వీరేంద్ర సచ్‌దేవ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిని ఆతిశీ అవమానించారని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో తాను నిర్వహించిన 13 శాఖలను ఆతిశీ తన వద్దనే ఉంచుకున్నారు. వీటిలో విద్య, రెవెన్యు, ఆర్థిక, విద్యుత్, పిడబ్లుడి శాఖలు ఉన్నాయి. శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ప్రతిష్టించి భరతుడు అయోధ్యను పాలించిన తరహాలోనే తాను కూడా ఈ నాలుగు నెలలు పరిపాలన సాగిస్తానని ఆతిశీ ప్రకటించారు.

పదవి నుంచి తప్పుకుని రాజకీయాలలో ఉండాల్సిన హుందాతనానికి ఉదాహరణగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచారని ఆమె అన్నారు. కేజ్రీవాల్ ప్రతిష్టను నాశనం చేసేందుకు బిజెపి శతవిధాలా ప్రయత్నించిందని ఆమె ఆరోపించారు. దురుద్దేశాలతోనే కేజ్రీవాల్ అరెస్టు జరిగిందని బెయిల్ ఇచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిందని, వేరే ఎవరైనా ఆ స్థితిలో ఉంటే ఒక్క క్షణం ఆలోచించకుండా ముఖ్యమంత్రి పదవిలో కూర్చునేవారని, కాని కేజ్రీవాల్ మాత్రం రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News