Saturday, December 21, 2024

కాళేశ్వరం ఇంజనీర్లపై అవినీతి నిరోధక చట్టం!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదీ జలాల ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ చేస్తున్న జస్టిస్ పి.సి.ఘోస్ కమీషన్ కాళేశ్వరం ఇంజనీర్లపై అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించాలన్న అభిప్రాయంతో ఉంది. విచారణలో భాగంగా కమీషన్‌ను తప్పుదోవ పట్టించినా , నేరపూరితంగా వ్యవహరించినా , అటువంటి వారిపైన అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని, భవిష్యత్తులో వారికి ప్రమోషన్లు ఇవ్వరాదని ప్రభుత్వానికి సిఫారసు చేసే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం.

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన బ్యారేజిలపై విచారణ చేస్తున్న కమీషన్ మంగళవారం నుంచి శనివారం వరకూ మళ్లీ విచారణ చేపట్టనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలలో పనిచేసిన, ఆ బ్యారేజి పనులతో సంబంధం ఉన్న ఇంజనీర్లను విచారణకు పిలిచి వారినుంచి మరిన్ని వివరాలను సేకరించనుంది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నివేదికలు అందజేయాలని ఇప్పటికే నీటిపారుదల శాఖను కమీషన్ ఆదేశించింది. బ్యారేజిల నిర్మాణానికి చెందిన ప్లేస్‌మెంట్ రిజిస్టర్, ఎం బుక్‌లను కూడా తీసుకురావాలని ఇంజనీర్లను ఆదేశించింది. అంతే కాకుండా తుది నివేదక అందజేయాలని విజిలెన్స్ విభాగానికి కూడా అదేశాలు జారీ చేసింది. కాగ్ అధికారుల నుంచి కూడా వివరాలను సేకరించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News