Monday, December 30, 2024

విలియమ్సన్ నయా రికార్డు

- Advertisement -
- Advertisement -

గాలె: న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డును నెల కొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ తరుఫున అత్యధిక పరుగులు చేసిరన బ్యాటర్‌గా నయా రికార్డును నమోదు చేశాడు. శ్రీలంకతో తాజాగా ముగిన తొలి టెస్టులో ఈ ఘనతను సాధించాడు.

ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన విలియమ్సన్, రెండో ఇన్నింగ్స్‌లో 30 పరగులతో ఆకట్టుకున్నాడు. దీంతో జాతీయ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన రాస్ టేలర్ రికార్డును బద్దలు కొట్టాడు. విలియమ్సన్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో 359 మ్యాచ్‌లలో 48.18 సగటుతో 18,213 పరుగులు చేశాడు. 34 ఏళ్ల అతను 2010లో భారత్‌పై న్యూజిలాండ్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. 2010లోనే భారత్ పై తొలి వన్డే..2011 లో జింబాబ్వేతో తన మొదటి టీ20 మ్యాచ్ ఆడాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News