Tuesday, September 24, 2024

ఆ బిల్లు కోసం గవర్నర్ తో సీతక్క భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 2022లో అసెంబ్లీలో పాస్ చేసిన ములుగు మున్సిపాలిటీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని గవర్నర్ ను మంత్రి సీతక్క కోరానని తెలిపారు. టెక్సికల్ ఇష్యూస్ తో ములుగు మున్సిపాలిటీ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందన్నారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో మంత్రి సీతక్క భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా మార్చే బిల్లుకు ఆమోదం తెలపాలని గవర్నర్ ను  కోరామన్నారు. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని వివరించారు. ఆదిలాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో గవర్నర్ పర్యటిస్తారని, ములుగు జిల్లా నుంచి కొన్ని గ్రామాలను గవర్నర్ దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. 2022లో ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ మారుస్తూ అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News