Sunday, November 24, 2024

ఢిల్లీలో తగ్గిపోయిన జననాల రేటు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఢిల్లీలో జననాల రేటు తగ్గిపోయింది. 2020లో ప్రతి 1000 మందికి 18.35 శాతం నుంచి 14.85 శాతానికి తగ్గిపోయింది. ఈ విషయాన్ని ‘యాన్యువల్ రిపోర్ట్ ఆన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ స్ అండ్ డెత్స్ ఇన్ ఢిల్లీ-2023’ పేర్కొంది.

కోవిడ్-19 కాలం తర్వాత 2020-2023 మధ్య కాలంలో జననాల రేటు ప్రతి 1000కి 13 నుంచి 15 మధ్య ఉందని ఆ రిపోర్టు పేర్కొంది. అయితే జననాల రేటు తగ్గిపోవడానికి కారణాన్ని మాత్రం ఆ రిపోర్టు పేర్కొనలేదు. సంవత్సరం వారీగా చూస్తే జననాలు రేటు ప్రతి 1000 మంది జనానికి 2019లో 18.35, 2020లో 14.85, 2021లో 13.13, 2022లో 14.24, 2023లో 14.66 గా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News