Wednesday, September 25, 2024

‘దేవర’ కన్నుల పండుగలా ఉంటుంది

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్, యువ సుధ ఆర్ట్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
నిజ ఘటనలను ఆధారంగా చేసుకోలేదు…
‘దేవర’ మూవీ కథ అంతా పిక్షనల్. ఎక్కడా నిజ ఘటనలను ఆధారంగా చేసుకోలేదు. మనిషికి మితిమీరిన ధైర్యం కూడా కరెక్ట్ కాదు. అది మూర్ఖత్వం అవుతుంది. మనకు తెలియకుండానే మనలో ఓ భయం ఉంటుంది. దాన్ని గౌరవించాలని చెప్పటమే ‘దేవర’ కథ. భయం లేకుండా ఉండాలనుకోవటం తప్పు.
అందుకనే సమయం తీసుకున్నాం…
ఎన్టీఆర్‌తో జర్నీ ఎప్పుడూ నాకు స్పెషలే. ‘దేవర’ స్టోరీలైన్ చెప్పినప్పుడు ఆయన స్పందించిన తీరుతోనే నెక్స్ లెవల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ‘దేవర’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లటానికే 6 నెలలు సమయం తీసుకున్నాం. సముద్రంపై ఎలా షూట్ చేయాలి.. అక్కడ లైటింగ్ వేరియేషన్స్ ఉంటాయి, మనం సముద్రాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి..దాన్నెలా చేయాలనే అంశాలపై స్టడీ చేశాం. అందుకనే సమయం తీసుకున్నాం.
దాంతో రెండు భాగాలుగా చేయాలనుకున్నాం…
‘దేవర’ సెకండ్ షెడ్యూల్ సమయంలో ఇంత పెద్ద కథను మూడు గంటల్లోపు చెప్పగలమా! అనే అందరం అనుకున్నాం. ఎందుకంటే నెరేషన్ 4 గంటలుంది. పేపర్ మీద పెట్టినప్పుడు అది 6-7 గంటలు వస్తుంది. సెకండ్ షెడ్యూల్ అప్పుడే మూడు గంటల్లో ఈ కథను చెప్పలేమని అర్థమైంది. దాంతో రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నాం.

ఎన్టీఆర్‌ని అనుకునే రాసుకున్నా…
ఎన్టీఆర్ పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. కథ రాసుకునేటప్పుడే రెండు పాత్రలకు ఎన్టీఆర్‌ని అనుకునే రాసుకున్నాను. దేవర కొడుకు వర పాత్ర ఆయన్ని మించేలా ఉంటుంది. దేవర రెండు భాగాల్లోనే పూర్తయ్యే సినిమా. ఈ సినిమా అందరికీ ఓ కన్నుల పండుగలా ఉంటుంది.
ప్రాక్టీస్ చేసుకుని సెట్స్‌కు వచ్చేది…
జాన్వీ కపూర్ ప్రతి విషయం ఎంతో జాగ్రత్తగా నేర్చుకుని మరీ చేసింది. వారం, పది రోజుల ముందు నుండే సీన్ పేపర్ కావాలని నన్ను అడిగి తీసుకుని ప్రాక్టీస్ చేసుకుని సెట్స్‌కు వచ్చేది. ఫస్ట్ డే షూటింగ్‌లో ఆమె నటించిన సీన్ కాగానే తారక్ ఫెంటాస్టిక్ అంటూ చేయి చూపించారు. ఇక సినిమాలో భైర పాత్ర ఎలా ఉండాలని నేను అనుకున్నానో సైఫ్ అలీఖాన్ అలాగే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News