Monday, December 30, 2024

రాములోరి రథంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది ఈశ్వర్ రెడ్డే: ఎస్ పి

- Advertisement -
- Advertisement -

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి రాములోరి రథానికి నిప్పు పెట్టినట్టు గుర్తించామని జిల్లా ఎస్ పి జగదీష్ తెలిపారు. రథం దగ్ధంపై అనంతపురం జిల్లా ఎస్ పి జగదీష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 23న రాములోరి ఆలయ రథానికి నిప్పు పెట్టారని, ఈ నెల 23న కనేకల్ మండలం హనకనహాళ్ లో ఘటన జరిగిందని, గ్రామస్థుల ఫిర్యాదు మేరకు 24 గంటల్లో కేసును ఛేదించామన్నారు.
ఎర్రి స్వామిరెడ్డి సోదరులు రూ.20 లక్షలు వెచ్చించి 2022లో రథం చేయించారని, గ్రామస్థులు నుంచి ఎలాంటి విరాళాలు సేకరించలేదని, గ్రామస్థుల నుంచి విరాళాలపై అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తోందని, అన్నదమ్ముల మధ్య గొడవతోనే ఎర్రిస్వామిరెడ్డి కుమారుడు నిప్పు పెట్టాడని
అర్థరాత్రి ఈశ్వర్ రెడ్డి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు విచారణలో ఒప్పుకున్నారని వివరించారు. ఈశ్వర్ రెడ్డి ప్రస్తుతం వైసిపి కార్యకర్త అని, అయితే ఇందులో రాజకీయ కోణం లేదన్నారు. రథానికి నిప్పు పెట్టే అంశంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈశ్వర్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News