Friday, December 20, 2024

తాజ్ మహల్ హోటల్ కు షోకాజు నోటీసులు

- Advertisement -
- Advertisement -

అబిడ్స్ రోడ్‌లోని తాజ్ మహల్ హోటల్‌లో పప్పులో పురుగు కనిపించడం గురించి సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఈ నెల 24న అట్టి హోటల్ లో జిహెచ్‌ఎంసి ఫుడ్ సేప్టి అధికారులు తనిఖీలు నిర్వహించారనిహెల్త్ అడిషనల్ కమిషనర్ పంకజ తెలిపారు. తనిఖీలో భాగంగా అట్టి హోటల్ లో సరైన పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, ఆహార పదార్థాలకు సంబంధించిన ఐటమ్స్ పై లేబుల్స్ లేకపోవడం, నిల్వ చేసే ప్రదేశంలో బొద్దింకలు ఉండటం వంటి అనేక లోపాలుఆహార భద్రత అధికారులు గమనించారని పేర్కొన్నారు. ఈ సంద్భ్రంగా హోటల్ నిర్వ్హ్కులకు సంజాయిషి కోరుతూషోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. సంజాయిషి అందిన పిమ్మట తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News