Monday, January 20, 2025

తిరుమలలో భక్తలు రద్దీ సాదారణం..

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది.

ఇక, మంగళవారం శ్రీవారిని 77,939 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 22,668 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.5 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. కాగా, సెప్టెంబ‌రు 28 నుండి 30వ తేదీ వ‌రకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News