Friday, September 27, 2024

‘గేమ్ చేంజర్’ సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

అయితే ఈనెల 28న సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. పల్లవిలోని లైన్స్ చూస్తుంటే.. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ మూవీ నుంచి పక్కా మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్‌ను అలరించబోతుందని అర్థమవుతుంది. ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు. ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చిన ‘జరగండి జరగండి..’ పాట ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News