Monday, November 25, 2024

నేడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎక్స్ పైరీ రోజు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు స్టాక్ మార్కెట్ లో బుల్స్ పట్టు బిగించారు. వారి కొనుగోళ్తతో పాటు, గ్లోబల్ మార్కెట్ కూడా సానుకూలంగా ఉండడంతో మార్కెట్ ఊపందుకుంది. పైగా నేడు ఎఫ్ అండ్ ఓ ఎక్స్ పైరీ రోజు కావడంతో మార్కెట్ బాగా ఊపందుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 666.25 పాయింట్లు లేక 0.78 శాతం పెరిగి 85836.12 వద్ద, నిఫ్టీ 211.80 పాయింట్లు లేక 0.81 శాతం పెరిగి 26216 వద్ద ముగిసింది. నేటి డే ట్రేడింగ్ లో బిఎస్ఈ సెన్సెక్స్ 85930.43 ఫ్రెష్ హైని, నిఫ్టీ 26250.90 ఫ్రెష్ హై ని తాకాయి. కాగా ఇంట్రాడే లో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 54467.35 కొత్త అత్యధిక స్థాయిని తాకింది. గ్లోబల్ మార్కెట్ సానుకూలత ఉన్నప్పటికీ మన దేశీయ స్టాక్ మార్కెట్ తొలుత ఫ్లాట్ గానే మొదలయింది. కానీ తర్వాత బాగా పుంజుకుంది. నిఫ్టీ తొలిసారి 26250 పాయింట్ల మైలు రాయిని తాకింది.

నిఫ్టీలో మారుతి సుజుకీ, టాటా మోటర్స్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం షేర్లు ప్రధానంగా లాభపడగా, ఓఎన్ జిసి, సిప్లా, ఎన్ టిపిసి, హీరో మోటో కార్ప్, ఎల్ అండ్ టి ప్రధానంగా నష్టపోయాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News