Friday, September 27, 2024

నేడు ‘ ప్రవాసీ ప్రజావాణి ‘ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : విదేశాల్లో పనిచేసే కార్మికుల బాధలను, వారి కుటుంబ సభ్యుల ద్వారా హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ లో ’ప్రవాసీ ప్రజావాణి’ లో విన్నవించుకునే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. ఈనెల 27 వ తేదీ శుక్రవారం రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంఎల్‌సి, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు కలిసి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి ‘ ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించనున్న ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనుంది. శుక్రవారం లాంఛనంగా ప్రారంభం కానున్న ‘ ప్రవాసీ ప్రజావాణి ’ ఏర్పాట్లను ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు డాక్టర్ వినోద్ కుమార్, మంద భీం రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి ( దుబాయ్ ), బొజ్జ అమరేందర్ రెడ్డి ( అమెరికా ), గంగసాని నవీన్ రెడ్డి ( లండన్ ), చెన్నమనేని శ్రీనివాస్ రావు గురు వారం ప్రజా భవన్ లో పరిశీలించారు. గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇండి యాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని భారత ప్రభుత్వ దేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను, విదేశాలలోని భారత రాయబార కార్యాల యాలను సంప్రదించదానికి సరైన మార్గదర్శనం లేక దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి ప్రవాసి కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు మధ్యన ఒక వారధిలాగా పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అందించే దౌత్య సంబంధమైన సేవలను వేగవంతం చేయడానికి ’ప్రవాసీ ప్రజావాణి’ ఉపయోగ పడుతుంది. వేతన బకాయిలు (సాలరీ డ్యూస్), యజమానితో సమస్యలు (స్పాన్సర్ ప్రాబ్లం), ఉద్యోగ ఒప్పంద సమస్య (కాంట్రాక్టు ప్రాబ్లం), పరిహారం (కాంపెన్సేషన్), కార్మికులను ఇబ్బంది పెట్టడం (వర్కర్ అబ్యూస్), విదేశంలో జైలు పాలయినప్పుడు (ఇంప్రిజండ్ అబ్రాడ్), మృతదేహాలను స్వదేశానికి రవాణా చేయడం (మోర్టల్ రిమేన్స్), స్వదేశానికి వాపస్ పంపడం (రిపాట్రియేషన్), తప్పిపోయిన / జాడ తెలియని వారి ఆచూకి తెలుసుకోవడం (వేర్ అబౌట్స్ అన్నోన్), వివాహ సంబంధ వివాదాలు (మారిటల్ డిస్పూట్) లాంటి ఫిర్యాదులు, విజ్ఞప్తులు ‘ ప్రవాసీ ప్రజావాణి ‘ లో నమోదు చేసుకోవచ్చు. రిక్రూటింగ్ ఏజెంట్ల మోసాల గురించి పోలీస్ శాఖ, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఈ) ల సహాయం తీసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News