కాన్పూర్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై భారత్ టాస్ నెగ్గింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక, చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది.తొలి టెస్టులో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్‌కు ఈ రెండో టెస్టు సవాల్‌గా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి బంగ్లాకు నెలకొంది. లేకపోతే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది.
జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రిషబ్ ంపత్, రవీంద్ర జడేజా, అశ్విన్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్, బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్.
బంగ్లాదేశ్: మహ్మదుల్ హసన్ జాయ్, షద్మన్ ఇసలామ్, జాకిర్ హసన్, మోమినుల్ హక్, నజ్ముల్ హుస్సేన్ షాంటో (కెప్టెన్), రహీం, షకిబ్, లిటన్ దాస్, జాకేర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, ఖాలేద్ అహ్మద్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, నాహిద్ రాణా, తైజుల్ ఇస్లామ్, నయీం హసన్.