Saturday, December 21, 2024

మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా: ఎన్టీఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఈరోజు (సెప్టెంబర్ 27న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దేవర మూవీకి పాజిటీవ్ టాక్ వస్తోంది. రిలీజ్ సందర్భంగా అర్థరాత్రి నుంచే షోలు వేశారు. అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. దేవర మూవీ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్పందించారు. “నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది… మీ అపురూపమైన స్పందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. కొరటాల శివ, ఆకట్టుకునే డ్రామా, భావోద్వేగ అనుభవంతో దేవరను ఊహించినందుకు ధన్యవాదాలు. నా సోదరుడు అనిరుధ్..  మీ సంగీతం, నేపథ్య స్కోర్ప్ర దేవర ప్రపంచానికి జీవం పోశాయి. నా నిర్మాతలు హరికృష్ణ కొసరాజు, సుధాకర్ మిక్కిలినేని బలమైన స్తంభాలుగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. దేవర టీమ్ కు పెద్ద థ్యాంక్స్. నా అభిమానులకు, దేవర కోసం మీరు జరుపుకునే వేడుకలను చూడటం నన్ను చాలా ఆనందానికి గురి చేసింది. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నేను చేసినంతగా మీరు కూడా ఆనందిస్తున్నందుకు సంతోషం. మీ అందరినీ అలరిస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను” అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News