Saturday, December 21, 2024

మియాపూర్ లో 9వ అంతస్తు పైనుంచి దూకిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మియాపూర్ ప్రాంతం మయూరి నగర్ లో తొమ్మిదోవ అంతస్తు పైనుంచి దూకి సాప్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మియాపూర్ ప్రాంతం మయూరి నగర్ లోని దివ్య శక్తి అపార్ట్ మెంట్ లో సాయి సింధూర(29) అనే మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ తన భర్త, బాబు తో కలిసి ఉంటుంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు భర్తతో విభేదాల వల్ల డిప్రెషన్ లో ఉంది. ఈ రోజు తాను ఉంటున్న అపార్ట్ మెంట్ తొమ్మిదో అంతస్తు పైనుంచి సింధూర దూకింది. తీవ్ర రక్త స్రావం కావడంతో ఆమె ఘటన స్థలంలోనే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News