Saturday, September 28, 2024

చివరికి మిగిలింది పదవీ రాజకీయాలే

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఘాటు స్పందన
ఛత్రపతి శంభాజీనగర్ : ఇప్పుడు రాజకీయాలకు నిర్వచనం మారిందని, ఇప్పటి రాజకీయాలు కేవలం కిస్సా కుర్సీగా బాపతు పవర్ రాజకీయాలు అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి స్పందించారు. నిస్వార్థ సామాజిక సేవ, దేశ నిర్మాణం, ప్రజల బాగోగులలకు రాజకీయాలు పర్యాయపదాలుగా ఉండేవి. ఇది ఒకప్పటి మాట. అయితే ఇప్పుడు రాజకీయాల అర్థం మారిందని బిజెపి సీనియర్ నేత, కేంద్రంలో ప్రముఖ మంత్రి అయిన గడ్కరీ వ్యాఖ్యానించారు.రాజస్థాన్ గవర్నర్ హరిబాబు బగాడే సన్మాన కార్యక్రమంలో గడ్కరీ శుక్రవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత రాజకీయాలపై తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితిపై ఆవేదన ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సేవకు ప్రతిరూపంగా ఉండే రాజకీయాలు ఇప్పుడు అధికారం లక్షంగా సాగే తంతుకు మారిందన్నారు. గతంలో రాజకీయాలు అంటే సమాజ్‌కరణ్, రాష్ట్ర కరణ్, వికాస్ కరణ్‌గా ఉండేవి. అయితే ఇప్పుడు రాజకీయాలు కేవలం సత్తాకరణ్ అంటే పవర్ పాలిటిక్స్ అయ్యాయని వ్యాఖ్యానించారు. తాను ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా పనిచేసినప్పుడు పలు కష్టాలు ఎదుర్కొవల్సి వచ్చిందన్నారు. తాను, హరిబాబు ఇద్దరమూ కలిసి అంకితభావంతో పనిచేశామని , తాను ఆటోలో తిరగుతూ ఆర్‌ఎస్‌ఎస్ గురించి మైక్‌లలో చెపుతూ తిరిగేవాడనని , ఓ సారి తమ ఆటోను ఓ గుంపు నిలిపివేసి, తగులబెట్టి పోయిందని గుర్తు చేసుకున్నారు. తాను నేత కన్నా కార్యకర్తగా ఎక్కువగా సంతృప్తితో ఉన్నానని తెలిపిన గడ్కరీ నిజమైన పార్టీ కార్యకర్త అంటే ఎవరు? ఎవరైతే తనకు పార్టీ నుంచి ఏదీ దక్కకపోయినా పార్టీలో పద్ధతి ప్రకారం నడుచుకునేవాడే కార్యకర్త, కార్యదక్షత వారికి గీటురాయి అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News