Saturday, December 21, 2024

కాళేశ్వరం ఆలోచనలన్నీ కెసిఆర్‌వే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథరం చేపట్టాలన్న ఆలోచన ఎవరు చేశారు.. ఈ పధకం ఎవరి బ్రెయన్ చైల్డ్ ..గోదావరి నదిలో మూడు బ్యారేజిల ఆలోచన ఎవరు చేశారు ..అంటూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అక్రమాలు, అవినీతి అవక తవకలపై చిచారణ చేస్తున్న జస్టిష్ పి.పి ఘోస్ నేతృత్వంలోని జ్యుడిషియరీ కమీషన్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. న్యాయ విచారణలో భాగంగా శుక్రవారం కాళేశ్వరం కార్పోరేషన్ ఎండిగా విధులు నిర్వహిస్తున్న గజ్వేల్ ఈఎన్సీ హరిరాం కమీషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమీషన్ హరిరాం పై పలు ప్రశ్నలు సందించింది. కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకం మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ బ్రెయిన్ చైల్డ్ అని కమీషన్ ఎదుట హరిరాం వెల్లడించారు. అంతే కాకుండా గోదావరి నదిలో మూడు బ్యారేజిలను నిర్మించాలన్న ఆలోచన కూడా మాజీ సిఎందే అని స్పష్టం చేశారు. తుమ్మడి హెట్టినుంచి ఈ ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారని ప్రశ్నించగా ,మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలవల్లనే ఈ ప్రాజెక్టు స్థలం మార్చినట్టు తెలిపారు.

2015లో తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమ్ంరత్రుల సమావేశంలో చర్చల తర్వాత ఆప్పటి సిఎం కేసిఆర్ బ్యారేజిల ఆలోచన చేసినట్టు వెల్లడించారు.మేడిగడ్డ బ్యారేజి ఎందుకు కూలింది..కారణాలు ఏమిటి.. ఈ నష్టానికి బాధ్యులెవరు అని ప్రశ్నల మీద ప్రశ్నలతో కమీషన్ ఉక్కిరి బిక్కిరి చేసింది.బ్యారేజి గేట్ల ఆపరేషన్ మెయింటినెన్స్ సరిగా లేకపోవటం వల్లే అది కూలిపోయినందుకు ప్రధాన కారణం అని ఎండి హరిరాం స్పష్టం చేశారు. 2017నాటి హైలెవల్ కమిటి మినిట్స్‌ను కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ అమలు చేయలేదని కమీషన్‌కు ముందు కుండ బద్దలు కొట్టారు. అప్పటి నీటిపారుదలశాఖలోని ముఖ్యఅధికారులుగా ఉన్న ఎస్‌కే.జోసి ఈఎన్సీ మురళీధర్ పేర్లను కూడా ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేసేందుకు నిధులకోసం ప్రత్యేకంగా కాళేశ్వరం పేరుతో కార్పోరేషన్‌ను ఎవరు ఏర్పాటు చేశారు అని ప్రశ్నించగా ..ఆనాటి నీటి పారుదల శాఖ కార్యదర్శిగా ఉన్న ఎస్‌కె జోషి ఏర్పాటు చేశారని వెల్లడించారు. కాళేశ్వరం కార్పోరేషన్‌కు సీఈవో లేరని తెలపగా , ఎందుకు నియమించలేదు అని కమీషన్ ప్రశ్నించింది.

కంపెనీ చట్ట ప్రకారం సీఈవోను నియమించాలి కదా అని ప్రశ్నించింది. ప్రభుత్వ చెప్పడం వల్లనే అలా చేశామని ఎండి హరీరాం తెలిపారు. కాళేశ్వరం కార్పోరేషన్ ద్వారానే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి పధకానికి కూడా రుణాలు తీసుకున్నామని ఎండి తెలిపారు. కాళేశ్వరం కార్పోరేషన్‌లో పాలమూరు పథకాన్ని చేర్చడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారం కాదా అన్ని జస్టిష్ ఘోష్ ప్రశ్నించారు. కార్పోరేషన్ ఇంటర్నల్ ఆడిటర్ జవహర్ ఏజెన్సీ స్టాట్యుటరి ఆడిటర్‌ని ప్రతిఏటా కాగ్ నియమించిందని తెలిపారు. రామకృష్ణ అండ్‌కో , నరసింహ అసోసియేట్స్ ,రామ్మూర్తి అండ్‌కో ,కృష్ణ ప్రసాద్‌ను ఇప్పటివరకూ నియమించిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌ను ప్రభుత్వానికి సమర్పించారా అని ప్రశ్నించాగా సమర్పించామని , అసెంబ్లీల పెట్టారా లేదా అన్నది తనకు తెలియదని హరిరాం వెల్లడించారు.

కాళేశ్వరంకు రూ.87449.16కోట్లు రుణాలు:
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం ఎంత రుణం తీసుకున్నారని కమీషన్ ఎండి హరిరాం ప్రశ్నించింది. ఇంట్రెస్ట్ డ్యూరింగ కన్‌స్ట్రక్షన్(ఐడిసి)తో కలిపి మొత్తం రూ.87449.16కోట్లు , ఐడిసి ఏలకుండా రూ.74718.44కోట్లు రుణంగా తెచ్చినట్టు ఎండి తెలిపారు. వాటిలో వివిధ బ్యాంకులు రూ. 62825.39కోట్లు విడుదల చేశాయని వెల్లడించారు. కార్పోరేషన్ ద్వారానే పాలమూరు-రంగారెడ్డి పథకానికి కూడా రుణాలు తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఐడిసితో రూ.10,000కోట్లు ,ఐడిసి లేకుండా రూ7725.91కోట్లు రుణంగా తీసుకున్నట్టు తెలిపారు. బ్యాంకులు రూ.7145.77కోట్లు విడుదల చేశాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాల్లో వడ్డీ అసలు కలిపి రూ.29737.06కోట్లు తిరిగి బ్యాంకులకు చెల్లించినట్టు కమీషన్‌కు తెలిపారు. ఇంకా ఎంత చెల్లించాల్సివుందని అడిగిన ప్రశ్నకు ప్రాజెక్టు కోసం అసలు కింద రూ.64212.78కోట్లు చెల్లించాల్సివుందని తెలిపారు.

కాస్ట్ బెనిఫిట్ ఎంత!
కాళేశ్వరం ప్రాజెక్టును ఇన్నివేలకోట్లు ఖర్చు చేసి నిర్మించడం వల్ల ఈ ప్రాజెక్టు ద్వారా లభించే కాస్ట్ బెనిఫిట్ ఎంత అని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.1.511 అని ఎండి హరీరాం కమీషన్‌కు తెలిపారు. శనివారం ఈఎన్సీ హరిరాం మరో మారు కమీషన్ ఎదుట హాజరు కానున్నారు. కాళేశ్వరంకు చెందిన డాక్యుమెంట్లను సమర్పించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News