Saturday, December 21, 2024

నిరసనలు.. నిలదీతలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో/ఎల్బీనగర్: నిరసనలు, నిలదీతలు, ధర్నాలతో మూసీనది సర్వే ఉద్రిక్తతలకు దారితీసింది. అధికారుల స ర్వేను బాధితులు అడుగడుగునా అడ్డుకోవడం తో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. అధికారులు చేస్తున్న సర్వేను బాధితులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్తతపరిస్థితులు నెలకొన్నాయి. రెండోరోజు మూసీ సర్వే చేపట్టిన అ ధికారులకు బాధితుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. గ్రేటర్ హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొట్టమొదటిసారిగామూసీనది వెంట ఉన్న ప్రజలు ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఎల్‌బీనగర్ పరిధిలో, జి యాగూడ, బహదూర్‌పురాలో బాధితులు అ డుగడుగునా ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. లంగర్‌హౌస్ డిఫెన్స్‌కాలనీ వారు రోడ్డుపై బైఠాయించారు. అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. గంటట్రాఫిక్ స్తంభించింది. పెద్దఎత్తున ఆం దోళన మొదలవుతోన్న నేపథ్యంలో పరిస్థితిని అదుపులోనే ఉండేలా పోలీసులు చేసిన ప్రయ త్నం ఫలించి ట్రాఫిక్ క్లియర్
అయ్యింది. ఆందోళనకారులు కూడా సానుకూలంగానే వ్యవహరించారు. ఈ సంఘటనలు మూసీనది వెంట శుక్రవారం చోటుచేసుకున్నాయి.

ప్రశ్నల వర్షం..
సుందరీకరణ పేరుతో మూసీనదివెంట నివాసితులను ఖాళీచేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ తీరుపై, వచ్చిన అధికారులపై పేదలు ఆగ్రహంతో ఊగిపోయారు. రేవం త్ రెడ్డి ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించా రు. పేదల సంక్షేమం అంటే పేదల ఇండ్లను కూలగొట్టడమేనా? కాయకష్టంచేసుకుంటూ కాలం వెళ్ళదీసే వారినే ఖాళీచేయమంటారా..? అని అనుమతులున్నాయి. పన్ను లు చెల్లిస్తున్నాం.. అయినా తరలించడం ఎంతవరకు న్యా యమంటూ మూసీనదిబాధితుల నిలధీతలు చోటుచేసుకున్నాయి. తమ ఊళ్ళకు వెళ్ళి మరీ కాంగ్రెస్‌కు ఓటేసిం ది ఇందుకేనా..?, వ్యవసాయ భూమిపై లోను తీసుకుని ఇంటిని కట్టుకున్నాం. 25 ఏండ్లుగా ఇక్కడే ఉంటూ చిరువ్యాపారం చేసుకుంటున్నాం. ఉన్నఫలంగా ఖాళీచేయిస్తే నా ఉపాధి ఎలా?, కూలీపనిచేసుకుని బ్రతుకుతున్నమమ్మల్ని ఇక్కడినుంచి పంపిస్తే మా బ్రతుకేమి కావాలి..? అంటూ పేదలు తమగోడును వెళ్ళబోసుకున్నారు. మరికొందరు పరుషపదజాలంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.

రోడ్డుపై బైఠాయింపు.. అడ్డగింపు..
మూసీనదిని సుందరీకరణ అంటూ తమ బతుకులను ఛిద్రం చేస్తున్నది ప్రభుత్వమంటూ బాధితులు మండిపడితున్నారు. లంగర్‌హౌస్ పరిధిలో మూసీ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. డిఫెన్స్ కాలనీ వాసు లు రింగు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమ కు అన్యాయం చేస్తుందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినదించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జియాగూడ్, అత్తాపూర్‌లో బాధితులు పెద్దెత్తున నిరసన లు చేపట్టారు. రోడ్డుపైకి భారీగా తరలివచ్చి ఆందోళనకు దిగారు. దిల్‌సుఖ్‌నగర్ చైతన్యపురి, సత్యానగర్, మారుతీ నగర్‌లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తుండగా అడ్డుకునే ప్రయత్నాలను బాధితులు చేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య ఇండ్లకు మార్కింగ్ జరుగుతుంది. ఇ క్కడి నుంచి తాము ఎక్కడికీ వెళ్లేదిలేదని, డబుల్ బెడ్ రూ మ్ ఇండ్లు తమకు అవసరంలేదని బాధితులు తేల్చిచెప్పుతున్నారు. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇదే నా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ, తాము ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని వారు తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు. ఇక్కడ అందరం కాంగ్రెస్ వాళ్లమేనని, మార్పు మార్పు అని ఓట్లు వేస్తే రోడ్ల మీదకు తెస్తారా..? అంటూ తమ ఆవేదనను వెల్లడించారు.

ఎల్బీనగర్‌లో నిలదీత
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో కోత్తపేట ,చైతన్యపురి డివిజన్‌లలో న్యూమారు తినగర్, వినాయకనగర్, సత్యనగర్‌కాలనీలో మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులు పెద్ద ఎత్తున అందోళనకు దిగారు. అనుమతులన్నీ తీసుకొని, ఆస్తిపన్నులు కడుతూ, త్రాగు నీటి, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామనీ, ఏళ్ల తరబడి ఇక్కడే నివాసముంటున్న ఇండ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలు వదిలి పెట్టేందుకైనా తాము సిద్దంగా ఉన్నామనీ, మూసీ పరివాహక ప్రాంతానికి మా నివాసాలు చాలా దూరంగా ఉన్నాయంటూ భాదితులు వెల్లడిస్తున్నారు. మేడ్చల్ జిల్లా అధికారులు ఐదు టీంలగా ఏర్పడి మార్కింగ్ చేస్తున్నా రు. మొత్తం 225 ఇండ్లు ఉండగా ,50 ఇండ్లుకు మార్కిం గ్ చేశారని సమాచారం . భవాని నగర్ కాలనీ రోడ్డు నెం 10 లో 11 మంది స్వచ్చందంగా డబుల్ బెడు రూమ్‌లకు వెళ్లారు. ఎల్బీనగర్, వనస్దలిపురం ఏసీపీ కృష్ణయ్య, కాశిరెడ్డిలు అధ్వర్యంలో పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాదితులు పెద్ద యెత్తున్న అందోళన చేయడంతో మేడ్చల్ ఏంఆర్‌ఓ శైలజను, ఉప్పల్ ఎంఆర్‌ఓ వాణిని పోలీసులు బయటికి తీసుకువెళ్లారు.

ప్రభుత్వం మాకిచ్చే నజరానా ఇదేనా? : కవిత
మా ఇళ్లు కట్టుకోని 28 ఏండ్లు అయిందని , మా ఊరిలో వ్యవసాయం లోను తీసుకోని మెట్టు మెట్టు నిర్మాణం చేసుకున్నామని భాదితురాలు కవిత తెలిపారు. మా ఇండ్లు కూల్చివేస్తే మేము ఎలా బతుకులా తెలిపాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు? మేము ఓట్లేసి గెలిపిస్తే ప్రభు త్వం మాకు ఇచ్చే నజరానా ఇదేనా ప్రశ్నించింది?
కిరాణ షాపుతో ఉపాధి..
నేను 22 యేండ్లు క్రితం వచ్చి కిరాణ షాపు పెట్టుకోని జీవనం సాగిస్తున్నాను. ప్రభుత్వ అనుమతులు తీసుకోని, ఆస్తిపన్ను, తాగునీటి బిల్లులు కడుతున్నామని, ఇప్పుడు ఇళ్లు కూల్చివేస్తా ఎలా అంటూ ప్రశ్నించారు.
కూలిపనే ఆధారం..
కూలి పని చేసుకుంటు మా పిల్లలు పోషించుకుంటున్నామని, కూల్చివేసి డబుల్ బెడు రూమ్ ఇస్తే ఎలా మనేమ్మ ప్రశ్నించారు? మాకు ప్రభుత్వం రిజస్ట్రేషన్లు ఎ లా చేసిందని, గాంధీ ప్రభుత్వం పేదలకు న్యా యం చేస్తుందు అనుకున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.

పూల వ్యాపారమే దిక్కు..
అధికారులు మార్కింగ్ చేయడంతో మహేశ్ శానిటేజర్ ఓంటి పోసుకున్నాడు. దీంతో పోలీసులు వెంటనే నీటిని పోసి ఎలాంటి అఘాయిత్యం చేయకుండ జాగ్రత్తలు తీ సుకున్నారు. అనంతరం మహేశ్ మాట్లాడుతూ పూల వ్యాపారం చేసుకుంటున్నాని, గత 2530 యేండ్ల్ల నుం చి ఇక్కడ ఉంటున్నామని , రేషన్ కార్డు ఇక్కడే ఉందని, ప్రభుత్వానికి ఆస్తి పన్ను కడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇండ్లు కూల్చివేస్తే మేము ఎం కావాలని ప్రశ్నించారు.

కాలగర్భంలో కలిసిపోతారు : ఈటల
మూసీ పరివాహక ప్రాంత వాసులకు అండంగా మల్కాజిగిరి ఎంపి ఈటెల రాజేందర్ అక్కడికి రావడంతో అం దోళన కారులు పెద్ద యెత్తున్న రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. మల్కాజిగిరి ఎంపి ఈటెల రాజేందర్ భాదితులు ఇళ్లను, మూసీ పరీవాహక ప్రాంతం ఎంత దూరం అంతా పరిశీలించారు. నేను మీకు అండంగా ఉంటానని బాధితులతో కలసి 12.00 గంటల నుంచి నేల మీద భైఠాయించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. పేద ప్రజలతో పెట్టుకున్న ముఖ్యమంత్రి కాలగర్భంలో కలిసి పోవడం ఖాయం, హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి చేస్తున్న డ్రామాలను ప్రజలందరు గమనిస్తున్నారు. పేదల కడుపు కోట్టే దుర్మార్గమైన చర్యలకు దిగిందని మండిపడ్డారు. దోంగల్లా వచ్చి శనివారం ,ఆదివారం ఇం డ్లను కూల్చివేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు.

ల క్షల మందితో రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడి కార్యక్రమా న్ని చేపడుతానని హెచ్చరించారు. ప్రజలు భిక్ష పెడితే నీవు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ,రేవంత్‌రెడ్డి అది మర్చిపోవద్దని ఆరోపించారు. అధికారులు ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ గుత్తేదారుల కు బిల్లులు రాక నానా యాతనలు పడుతున్నారని, ఆరో గ్య శాఖ, సర్పంచులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనేక సమస్యలను మళ్లించడానికి రేవం త్ పాలన కోనసాగుతుందని, ఆర్థ్దిక వ్యవస్ద కుప్ప కూలిపోయిందన్నారు. అనంతరం ఈటల మద్దతుగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిరసన తెలిపారు. ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ప్రేమేందర్‌రెడ్డి, రం గారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ,కార్పోరేటర్లు రంగా నర్సింహ్మగుప్తా, పవన్‌కూమార్, ప్రేమ్ నర్సింహ్మరెడ్డి, నవ జీవన్‌రెడ్డి , రాధ ధీరజ్‌రెడ్డి, సురేందర్ యాదవ్ ,నాయకలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News