Thursday, December 19, 2024

ఒడిషా భద్రక్ జిల్లాలో ఘర్షణలు..ఇంటర్నెట్ సేవల నిలిపివేత

- Advertisement -
- Advertisement -

ఒడిషాలోని భద్రక్ జిల్లాలో అధికారులు శనివారం ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అభ్యంతరకరమైన ఓ సోషల్ మీడియా స్పందన ఇరు వర్గాల నడుమ చిచ్చుకు దారితీసింది. పలు చోట్ల పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయి. ముందుగా జిల్లాలోని సంథియా ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. సామాజిక మాద్యమంలో ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలపై ఓ వర్గం రెచ్చిపోవడం, మరో వర్గంపై దాడులకు యత్నించడంతో పరిస్థితి అదుపుల తప్పింది.

తరువాత ఘర్షణలు ఈ జిల్లాలోని ధామ్‌నగర్ ప్రాంతానికి కూడా విస్తరించాయని పోలీసులు తెలిపారు. పరిస్థితిని అదుపులో పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగగా వారిపై కూడా కొందరు రాళ్లతో దాడికి దిగారు. ఈ దవలో ఓ డిఎస్‌పి సహా ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. భద్రక్ తహసీల్దార్ వాహనం కూడా ధ్వంసం అయింది. సామాజిక మాధ్యమాలలో ఘటనలవ్యాప్తి జరగకుండా వెంటనే అధికారులు స్పందించారు. ఇంటర్నెట్ ప్రసారాలను నిలిపివేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News