Saturday, November 16, 2024

ఈ ప్రశ్నలకు మోడీ ముందుగా బదులివ్వాలి:సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీని లక్షంగా చేసుకునేందుకు కర్నాటకలో తనకు వ్యతిరేకంగా నమోదైన మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) స్థలాల కేటాయింపు కేసును ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోడీపి కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య శనివారం విరుచుకుపడ్డారు. హిందెన్‌బర్గ్ నివేదిక, మణిపూర్ హింసాకాండపై మోడీ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. బిజెపిలో అనేకమంది అవినీతిపరులు ఉన్నారని ఆరోపిస్తూ ముందుగా తన సొంత పార్టీని చక్కదిద్దుకోవలసిందిగా ప్రధానికి ఆయన సూచించారు.

శనివారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిజెపిలో అనేకమంది అవినీతిపరులు ఉన్నారని, ప్రధాని మోడీ ముందు తన ఇంటిని చక్కదిద్దుకోవాలని వ్యాఖ్యానించారు. హిండెన్‌బర్గ్ నివేదికపై ఎందుకు మోడీ మాట్లాడరని, మణిపూర్‌ను ఆయన ఎందుకు సందర్శించలేదని సిద్దరామయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత అడిగిన ఇలాంటి అనేక ప్రశ్నలకు మోడీ ముందు జవాబివ్వాలని ముఖ్యమంత్రి డిమాండు చేశారు. కేంద్ర మంత్రి, జెడిఎస్ నాయకుడు హెచ్‌డి కుమారస్వామి చేఇసన ఆరోపణల గురించి ప్రశ్నించగా కుమారస్వామి అసత్యాలు మాత్రమే పలుకుతారని, ఆయన చెప్పే ప్రతి మాటకు తాను స్పందించబోనని సిద్దరామయ్య స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News