Sunday, September 29, 2024

తెలంగాణ జాతి గర్వించదగ్గ అద్భుతమైన కళాకారుడు పైడి జయరాజ్

- Advertisement -
- Advertisement -

వెండితెరపై తెలంగాణ కీర్తి పతాకం -పైడి జైరాజ్ అని, తెలంగాణ జాతి గర్వించదగిన అద్భుతమైన కళాకారుడు, దర్శకుడు, నటుడు, నిర్మాత పైడి జయరాజ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. స్వాతంత్య్రానికి పూర్వమే ముంబైకి వెళ్లి అక్కడ బాలీవుడ్‌లో తనదైన ప్రతిభతో ప్రత్యేక ముద్ర వేసి గొప్ప హీరోగా వెలుగొందారని, కరీంనగర్ నుంచి మొదలెట్టి హైదరాబాద్ వ్యాయామశాలలో శిక్షణ పొంది, జాతీయ చలనచిత్ర సీమను కొన్ని దశాబ్దాల కాలం పాటు ఏలిన గొప్ప నటుడు పైడి జైరాజ్ అని ఆయన అన్నారు. సినిమాల్లో నటించాలన్న తన కలను సాధించడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని గెలిచిన జైరాజ్ జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణలో సినీరంగంలో ఎదుగుదామనుకునే నవ యువ దర్శకులు, నటులు ముందుకెళ్లాలని ఆయన సూచించారు. పైడి జయరాజ్ 115వ జయంతి సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్,

నంది పురస్కార గ్రహీత పొన్నం రవిచంద్ర, పైడి జయరాజ్ జీవితం పై రాసిన ‘ద ఫస్ట్ యాక్షన్ హీరో ‘ పుస్తకాన్ని సచివాలయంలో శనివారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పుస్తక రచయిత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ పైడి జయరాజ్ 1980లోనే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందారని, దాదాపు 130కి పైగా సినిమాల్లో హీరోగా నటించారని, మూకీ సినిమాల కాలంలోనే తెలంగాణ ప్రాంతం నుంచి ముంబైకి వెళ్లి ఆనాటి పృథ్వీరాజ్ కపూర్, శాంతారామ్,అశోక్ కుమార్ వంటి గొప్ప నటుల సరసన తనదైన ముద్రను వేసి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగుర వేశారని ఆయన వివరించారు. ఆయన జీవిత చరిత్రను పుస్తకంగానే కాకుండా, డాక్యుమెంటరీగా కూడా తీశామని, దీనికోసం వందలాది ఫొటోగ్రాఫ్‌లను జైరాజ్ వారసుల నుంచి సేకరించి ఈ గ్రంథ రచన చేశామని పొన్నం రవిచంద్ర సిఎంకు వివరించారు. ఆయన పేరిట తెలంగాణ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని వినతి పత్రం అందించారు. ఈ పుస్తకావిష్కరణలో రవాణా, బిసి అభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, భాషా సాంస్కృతిక శాఖ సంచా లకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, తిరుపతి ఇతరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News