Sunday, September 29, 2024

రాజ్యాంగాన్ని చదవండి సార్!

- Advertisement -
- Advertisement -

గవర్నర్ ఆర్‌ఎన్ రవి సెక్యులరిజం యూరోపియన్ భావన, భారతీయ భావన కాదు అన్న దగ్గర నుండి పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కొరడాలతో బలంగా ఒళ్లంతా కొట్టుకునే దాకా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామాల్ని గురించి దేశమంతటా ముఖ్యంగా మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఐపిఎస్ అధికారిగా పనిచేసి గవర్నర్ పదవి అలంకరించిన రవి భా రత రాజ్యాంగం ప్రియాంబుల్‌లో సెక్యులరిజం పదాన్ని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో సవరణ ద్వారా చేర్చారే తప్ప మొదటి నుండి రాజ్యాంగంలో లేదని ఈమధ్య ఎక్కడో మాట్లాడారు. ఎంతో అనుభవజ్ఞుడైన రవి తన పదవీకాలంలో పని ఒత్తిడి కారణంగా రాజ్యాంగాన్ని పూర్తిగా చదివి ఉండరు. గవర్నర్ అయ్యాకనైనా తీరిక వేళల్లో రాజ్యాంగాన్ని పూర్తిగా చదివి ఉంటే బాగుండేది. ఈ మాట ఎందుకు అనవలసివస్తున్నదంటే రాజ్యాంగాన్ని పూర్తిగా చదివిన తమిళనాడు శాసనసభ స్పీకర్ అందులోని ఆర్టికల్స్ 15, 17ను ఉటంకిస్తూ గవర్నర్ గారు చెప్పిన సెక్యులరిజం విదేశీ భావన అనే వాదన ఎట్లా లోపభూయిష్టమైందో తేల్చేశారు.

ఆర్టికల్ 15 ప్రకారం మతం, జాతి, కులం, జన్మించిన ప్రాంతం, లింగం ప్రాతిపదికన వివక్ష చూపడం నిషేధం. ఇక ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తున్నది. సరే ఎమర్జెన్సీ విధించిన కారణంగా తనకొచ్చిన చెడ్డపేరును తుడిచేసుకోవడానికి ఇందిరా గాంధీ 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులరిజం పదాన్ని చేర్చారనే అనుకుందాం. మరి ఆర్టికల్ 15, 17 మాటేమిటి. ఆ రెండు ఆర్టికల్స్ సారాంశమే కదా సెక్యులరిజం.సెక్యులరిజం అంటే ఏమిటి అర్థం. మతాన్ని రాజ్యం నుంచి, ప్రజా జీవితం నుంచి వేరు చేసి చూడమని. రాజ్యాంగాన్ని మనసుపెట్టి చదివి ఉంటే తమిళనాడు గవర్నర్ రవి గారు సెక్యులరిజం విదేశీ భావన అని ఎంతమాత్రం అని ఉండేవారు కాదు. ఇందిరా గాంధీ తన అవసరాల కోసం సెక్యులరిజం పదా న్ని చేర్చారని అని ఉండేవారు కాదు. రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉన్న సెక్యులరిజం భావనను మరింత ప్రస్ఫుటంగా చెప్పడానికి మాత్రమే ఆమె అట్లా చేర్చారని అనుకోవాలి. గవర్నర్ రవి మాత్రమే కాదు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన సాగించాల్సిన వాళ్లు, రాజకీయ కార్యకలాపాల్లో పా ల్గొనవలసిన వాళ్లు కూడా రాజ్యాంగాన్ని ఎప్పుడూ చదివినట్టు లేరు. గత పది రోజులుగా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు సంబంధించిన ఒక వివాదం పర్యవసానంగా అక్కడి రాజకీయ నాయకులు కొందరు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు ఈ అభిప్రాయం కలిగిస్తున్నాయి.

ఎంతో రాజకీయ అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదలుకొని, కొన్ని వేల పుస్తకాలు చదివాననే పవన్ కళ్యాణ్ దాకా సెక్యులరిజానికి, మత వి శ్వాసాలకు, సనాతన ధర్మానికి చెబుతున్న అర్థాలు వింటే బహుశా వాళ్ళు రా జ్యాంగం చదువుకోలేదేమో అనే అనుమానం కలుగుతున్నది. మతాన్ని రా జ్యం నుండి, ప్రజా జీవితం నుంచి దూరం చేసి చూడటం అంటే మతాన్ని ఇంటికి పరిమితం చేయమని అర్థం. ప్రజల మధ్య వైషమ్యాలను పెంచడానికి, విభేదాలు సృష్టించడానికి మతాన్ని ఉపయోగించుకోరాదు.
ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మొన్నటి పత్రికా గోష్టిలో నేను ఇంట్లో బైబిల్ చదువుతాను, బయటికి వస్తే హిందూ మతాన్ని, ఇ స్లాం మతాన్ని, సిక్కు మతాన్ని కూడా గౌరవిస్తాను, ఆ మతాచారాల ప్రకారం నడుచుకుంటాను అన్న దానికి అర్థం ఇదే. మనం నమ్మే మతాన్ని, మనం ఆచరించే మతాన్ని ఇతరుల మీద రుద్దకూడదు అని. ఆ మాట అన్నందుకు జగన్ మోహన్ రెడ్డి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. బై బిల్ ఇంట్లో రహస్యంగా ఎందుకు చదవాలి, బయటకు వచ్చి చదవచ్చు కదా అని. జగన్మోహన్ రెడ్డి తరఫున వకాల్తా పుచ్చుకోవడం కాదు గాని, ఆయన కానీ ఆయన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గానీ తమ మత విశ్వాసాలను ఎన్నడూ రహస్యంగా ఉంచుకోలేదు. ముఖ్యమైన సందర్భాలలో వారు ఇరువు రు చర్చిలకు వెళ్లడం అందరం చూసినాము. ప్రజా జీవితంలో ఉన్నంత మా త్రాన మత విశ్వాసాలు ఉండకూడదని ఏమీ లేదు. అయితే మనం అధికారం లో ఉన్నాం కాబట్టి మనం విశ్వసించే మతం మాత్రమే ఉండాలని, అందరూ అదే మతాన్ని ఆచరించాలని కోరుకోవడం రాజ్యాంగ విరుద్ధం.

ఇక రాజ్యాంగాన్ని గురించి, మత సామరస్యాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఎవరికి తోచిన నిర్వచనాలు వారు చెప్పుకోవడం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఇచ్చే ప్రసాదం లడ్డూకు సంబంధించి చెలరేగిన వివాదంలో అక్కడి రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఇందుకు నిదర్శనం. దేవుడిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం, పరిపాలనలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం, అదే విధంగా ప్రజల దృష్టిని సమస్యల నుంచి మళ్ళించడం కోసం జరుగుతున్న ఒక పెద్ద ప్రయత్నమే తిరుమలలో లడ్డు కల్తీ అనే వివాదం. మొన్న మే నెలలో ఎన్నికలు జరిగిన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా తాను కోరుకున్న అధికారిని నియమించిన తర్వాతనే జులై మాసంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేయడానికి ఉపయోగించే నెయ్యిలో కల్తీ కనుగొన్నామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. ఆ నెయ్యి వాడేసామని ముఖ్యమంత్రి, లేదు దాన్ని తిప్పి పంపించేసామని ఆ యనే కోరి నియమించుకున్న ఎగ్జిక్యూటివ్ అధికారి చెప్తున్నారు.

తిరుమలకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. తర చూ దానికి సంబంధించి పరీక్షలు జరుగుతుంటాయి. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలుమార్లు నెయ్యి నాణ్య త సరిగ్గా లేదని, కల్తీ జరిగిందని గు ర్తించి తిరస్కరించిన సందర్భాలు చా లా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు ఇది వివాదం అవుతున్నది.
మతం అత్యంత సున్నితమైన విష యం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వేంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన చేస్తామని చెప్పుకునే వాళ్ళు మతం గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డిఎ కూటమికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18వ తేదీన కూటమి శాసనసభా పక్ష సమావేశంలో ఈ వివాదం లేవనెత్తారు. ఒకటి ముందు చెప్పుకున్నట్టుగా ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు సాధ్యం కాని కారణం కావచ్చు, వరదల కారణంగా ఏర్పడిన దుర్భర పరిస్థితిని సమర్ధవంతంగా చక్కదిద్దలేకపోవడం కావచ్చు. వీటి నుంచి దృష్టి మళ్లించడానికి చంద్రబాబు నాయుడు ఈ అనవసర వివాదాన్ని లేపారు అనే ప్రచారం బలంగా ఉన్నది. తాను లేవనెత్తిన అంశంలో పస లేదనే విషయం అర్థమైంది. అందుకే ఆ వివాదాన్ని ముగించే క్రమంలో తన కనుసన్నల్లో మెలిగే అధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేశారు. మొదట్లో తిరుమల లడ్డు కల్తీ జరిగిందని నమ్మి ఎంతో బాధ పడ్డవాళ్లంతా అది నిజం కాదని తెలుసుకొని స్థిమితపడ్డారు. ఈ విషయం ముఖ్యమంత్రికి అర్థం అయిపోయింది. అందుకే ఇక ఆ అంశాన్ని పలుచన చేసే పనిలోపడ్డారు.

ఈలోగా లడ్డు పేరు మీద వివాదం రేపి టిటిడి ప్రతిష్ఠను, ప్రసాదం పవిత్రతను ముఖ్యమంత్రి దిగజార్చినందుకు రాష్ట్రంలోని గుడులన్నిటిలో పూజలు చేయాల్సిందిగా ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సిపి తమ శ్రేణులకు పిలుపునిచ్చింది. ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఆ కార్యక్రమంలో భాగంగా తిరుమల దర్శనానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు లడ్డు వివాదాన్ని తెరమరుగు చేసేందు కోసం జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థుడనే అంశాన్ని పైకి తెచ్చి దాని మీద వివాదం సృష్టించి చర్చకు తెరలేపారు. తన కూటమి భాగస్వాముల చేత జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం చేస్తేనే దర్శనానికి అర్హుడు అనే ప్రకటనలు చేయించి మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చేనాటికే క్రైస్తవ మత విశ్వాసాలు కలిగినవాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విశ్వాసాలు కలవాడు. 1978లో తొలిసారి శాసనసభ్యుడు అయిన దగ్గర నుండి మరణించే నాటి వరకు రాజశేఖర్ రెడ్డి శాసనసభ్యుడిగా, లోక్‌సభ సభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా అనేక సార్లు తిరుమల సందర్శనకు వెళ్లారు. ముఖ్యమంత్రిగా ఆయన పలుమార్లు తిరుమలలో వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల సందర్భంగా వస్త్రాలు అందజేశారు.

ఆయనని ఎప్పుడూ డిక్లరేషన్ ఎవరు అడగలేదు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా లోకసభ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా పలుమార్లు తిరుమల సందర్శించారు. దేవుడి దర్శనం చేసుకున్నారు. ఆయన తన పాదయాత్ర ప్రారంభంలో, చివరలో తిరుమలలో వెం కన్న దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి పలుమార్లు తిరుమల దర్శనం చేసుకోవడమే కాకుండా బ్రహ్మోత్సవాల సందర్భం గా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అప్పుడెప్పుడూ లేని డిక్లరేషన్ వివా దం ఇప్పుడు బిజెపి వారు గాని, చంద్రబాబు నాయుడు గాని ఎందుకు తెరపైకి తెచ్చినట్టు? జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఖరారు చేసుకున్న మరుక్షణమే కొండ మీద అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలనే బోర్డులు ఎందుకు వెలిసినాయి. ఆయన పర్యటన రద్దు చేసుకున్నాడని తెలియగానే ఎందుకు అవి మాయం అయినవి.
తిరుమలలో ఆధారాలు చూపి చేసుకునే ప్రత్యేక దర్శనాలు కాకుండా రోజు వేలాది మంది సర్వదర్శనం పేరిట శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఉజ్జాయింపుగా రోజుకో 50 వేల మంది స్వామిని దర్శించుకుంటారు.

వీరెవరి ఆ ధారాలు తెలుసుకునే అవకాశం ఉండదు. వీరంతా ఏ మతస్థులో తెలుసుకునే అవకాశం ఎవరికీ కలగదు. మరెందుకు ఎప్పుడూ లేని వివాదాన్ని ఇప్పుడు ఎన్‌డిఎ కూటమి రేపుతున్నట్టు? దేవాలయానికి, మసీదుకు, చర్చికి, గురుద్వారాకు ఆ మతంపట్ల విశ్వాసం లేని వాళ్ళు ఎందుకు వెళ్తారు? నేను ఈ మతాన్ని నమ్ముతున్నాను అని డిక్లరేషన్ ఇవ్వాలని అడగడమే ఒక విధంగా వారి మత విశ్వాసాన్ని కించపరచడం. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇంకో అంశం దొరికే వరకు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకపోవడాన్ని చర్చలో ఉంచుతారు.ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న వివాదంలో భిన్నకోణాలను కూడా పరిశీలకులు గమనిస్తున్నారు. గత ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ కల్తీ వివాదాన్ని తెర మీదకు తేగానే ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాషాయ బట్టల్లోకి మారిపోయి 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ప్రకటించి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని, తాను బలంగా సనాతన ధర్మాన్ని కోరుకునేవాడినని ప్రకటించారు. ఆయన ఆ మాటలు మాట్లాడిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో పవన్ కళ్యాణ్ ముస్లిం మతస్థుల ఇళ్లకు వెళ్ళి మాట్లాడిన మాటలు, క్రిస్టియన్ సమాజంలోకి వెళ్ళి బాప్టిజమ్ తీసుకున్నానని ప్రకటించిన విషయమూ పెద్దఎత్తున ప్రచారంలోకి వచ్చాయి.

ఇది మరో సినిమా కావొచ్చునన్న మాటలు కూడా వినిపించాయి.
హిందూ ధర్మపరిరక్షణ కోసం ప్రభుత్వంలోని నెంబర్ వన్ అండ్ టూ పోటీ పడుతున్నట్టు కనిపిస్తున్నది. ఎన్‌డిఎ జాతీయ స్థాయిలో ప్రధాన భాగస్వామి అయిన బిజెపి ఈ పోటీలో ఎవరు ముందు ఉంటారో గమనిస్తున్నదా అన్న సందేహం కలుగుతున్నది. ఇదిలా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం అజమాయిషీని ప్రభుత్వ అధీనంలో నుండి తొలగించి భక్తులకు అప్పగించాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అజమాయిషీ నుండి తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యాన్ని ఒక సనాతన ధర్మ సంస్థకు అప్పజెప్పాలని పెరుగుతున్న డిమాండ్ వెనుక మతలబు చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం గల నాయకుడికి ఈపాటికే అర్ధం అయి ఉంటుంది. ప్రజల బాగోగులు చూసుకోండి, సమర్థవంతంగా పరిపాలన చేయండి అని ప్రజలు ఓట్లేస్తే ఇటువంటి విషయాల మీద కాలాన్ని వృథా చేస్తున్న రాజకీయ పక్షాలను గురించి ప్రజలు ఆలోచించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News