గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మూవీ నుంచి సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా..’ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. తెలుగు, తమిళంలో ‘ రా మచ్చా మచ్చా..’ అంటూ సాగే ఈ పాట హిందీలో ‘ధమ్ తు దికాజా..’ అంటూ అలరించనుంది.
రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్‌గా తెరకెక్కిన ఈ పాట ఈనెల 30న రిలీజ్ అవుతుంది. కాగా శనివారం ప్రోమో విడుదలైంది. రా మచ్చా మచ్చా రా.. అంటూ సాగుతున్న ఈ పాటను ఇండియన్ సినీ హిస్టరీలో నెవ్వర్ బిఫోర్ అనేలా స్టార్ డైరెక్టర్ శంకర్ తన మార్క్‌ను చూపిస్తూ తెరకెక్కించారని ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. ఎనర్జిటిక్, స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్ ఆకట్టుకుంటున్నారు. ఏకంగా 1000కి పైగా జానపద కళాకారులు ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్నత్వానికి ఏకత్వమైన మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు.. ఇందులో భాగమవటం విశేషం. గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీలో మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీత సారథ్యంలో పాట రూపుదిద్దుకుంది. తెలుగు, తమిళం, హిందీలో నకాష్ అజీజ్ పాడిన ఈ పాటను తెలుగులో అనంత్ శ్రీరామ్ రాయగా, తమిళంలో వివేక్, హిందీలో కుమార్ రాశారు.
And the Game begins!#RaaMachaMacha | #DamTuDikhaja song promo out now 😊
Telugu – https://t.co/fyYug1ABYw
Hindi – https://t.co/AgwJ8iTwQ0
Tamil – https://t.co/ImB8L2wc7B@shankarshanmugh @MusicThaman @IananthaSriram , @Lyricist_Vivek , #Kumaar #GaneshAcharya @SVC_official… pic.twitter.com/4haoRyTwIq— Ram Charan (@AlwaysRamCharan) September 28, 2024