Thursday, December 19, 2024

కేంద్రం సాయపడ్డంలేదు: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర జిల్లాల్లో వరద పరిస్థితి ఘోరంగా ఉంది, కేంద్రం ప్రకృతి విపత్తు సాయం కూడా అందించడంలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. వరద ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన సాయం అందిస్తున్నామని ఆమె విలేకరులతో అన్నారు.

పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బీహార్, జల్పాయ్ గురి, అలిపురుద్వుర్ వరదలకు చాలా దెబ్బతిన్నాయి. కోశీ నది క్యాచ్ మెంట్ ఏరియాల్లో కురిసిన భారీ వర్షానికి బీహార్, మాల్దా, దక్షిణ్ దినాజ్ పుర్ జిల్లాలు బాగా ప్రభావితం అయ్యాయి. భవిష్యత్తులో మరింత ప్రభావితం కావొచ్చని సిల్ గురికి వెళుతూ మమతా బెనర్జీ తెలిపారు. ప్రకృతి విపత్తును ఎదర్కొనడంలో కేంద్రం సాయం అందించడంలేదన్నారు. ఫరక్కా బ్యారేజ్ నిర్వహణ పనులను కూడా కేంద్రం చేపట్టడంలేదన్నారు. పైగా ఆ బ్యారేజ్ నిల్వ స్థాయి బాగా తగ్గిపోయిందని తెలిపారు.

Mamata

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News