Sunday, September 29, 2024

హెజ్‌బొల్లాకు మరో షాక్.. వైమానిక దాడిలో కీలక నేత హతం

- Advertisement -
- Advertisement -

జెరూసలెం : లెబనాన్ ఉగ్రవాద గ్రూపు హెజ్‌బొల్లాకు మరోసారి ఊహించని దెబ్బతగిలింది. ఇజ్రాయెల్ ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత నబిల్ కౌక్ హతమయ్యాడు. హెజ్‌బొల్లా సెంట్రల్ కౌన్సిల్‌లో డిప్యూటీ హెడ్‌గా ఉన్న నబిల్ మృతి చెందినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే దీనిపై హెజ్‌బొల్లా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. గత కొన్ని వారాలుగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ కొనసాగిస్తోన్న భీకర దాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన పలువురు సీనియర్ కమాండర్లు హతమైన విషయం తెలిసిందే. శుక్రవారం దాడిలో హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా (64) మృతి చెందడం, ఆ గ్రూపునకు కోలుకోలేని దెబ్బ. ఈ సమయం లోనే మరోనేతను కోల్పోయింది. నబిల్ 1995 నుంచి 2010 వరకు సౌత్ లెబనాన్ లోని హెజ్‌బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు. 2020 లో అతడిపై అమెరికా ఆంక్షలు విధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News