Monday, September 30, 2024

నేడు సెబీ బోర్డు సమావేశం

- Advertisement -
- Advertisement -

ముంబై: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) బోర్డు మీటింగ్ నేడు జరుగనున్నది. ఈ సమావేశంలో అనేక చర్యలు చేపట్టనున్నది. అందులో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్ పై గట్టి నియమాలు, ‘న్యూ అసెట్ క్లాస్’, మ్యూచువల్ ఫండ్ లైట్ రెగ్యులేషన్స్ వంటివి ఉండనున్నాయి.

సెబీ బోర్డు సమావేశం జరుగనున్న నేపథ్యంలో మార్కెట్ ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతం మేరకు పతనం అయ్యాయి.

సెబీ ‘న్యూ అస్సెట్ క్లాస్’ను ప్రవేశపెడతానని జులైలోనే తెలిపింది. ఇది మ్యూచువల్ ఫండ్స్ అండ్ పోర్ట్ ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పిఎంఎస్) కింద ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ ను ఆఫర్ చేయనున్నది. న్యూ కేటగిరి ప్రొడక్ట్ కింద మ్యూచువల్ స్ట్రక్చర్ లో కనీస పెట్టుబడి పరిమితి రూ. 10 లక్షలు ఉండనున్నది.

నేటి సమావేశం చాలా ముఖ్యం కానున్నది. ఎందుకంటే సెబీ చైర్ పర్సన్ మాధబి పురి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ ‘కాన్ ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్’ కు పాల్పడ్డారని హిండెన్ బర్గ్ రీసెర్చ్, కాంగ్రెస్ ఆరోపించాయి. బోర్డు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News